AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అరె భయ్యా.. పాము అనుకున్నావా..? పొట్ల కాయ అనుకున్నావా..? స్నేక్ క్యాచర్ టాలెంట్ కు నెటిజన్స్ ఫిదా

ఎంతటి ధైర్యవంతుడైనా పాము అనగానే పదిగజాల దూరం పరిగెడతాడు. ఇక ఎదురుగా కనిపిస్తే ఏకంగా పై ప్రాణాలు పైకే పోయినంత షాక్‌ అవుతుంటారు. అయితే కొందరు మాత్రం బుసలు కొట్టే విషనాగులతో విన్యాసాలు చేస్తుంటారు. వాటిని మెడలో వేసుకోవడం, నడుముకు చుట్టుకోవడం వంటి పనులతో ఆకట్టుకుంటూ ఉంటారు. అలాంటి వీడియోలు సోషల్‌ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారతాయి. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది ఓ వ్యక్తి కింగ్ కోబ్రా పామును పట్టుకున్న విధానం చూసి నెటిజన్స్‌

Viral Video: అరె భయ్యా.. పాము అనుకున్నావా..? పొట్ల కాయ అనుకున్నావా..?  స్నేక్ క్యాచర్ టాలెంట్ కు నెటిజన్స్ ఫిదా
Cobra Snake Catcher
K Sammaiah
|

Updated on: Mar 25, 2025 | 6:53 PM

Share

ఎంతటి ధైర్యవంతుడైనా పాము అనగానే పదిగజాల దూరం పరిగెడతాడు. ఇక ఎదురుగా కనిపిస్తే ఏకంగా పై ప్రాణాలు పైకే పోయినంత షాక్‌ అవుతుంటారు. అయితే కొందరు మాత్రం బుసలు కొట్టే విషనాగులతో విన్యాసాలు చేస్తుంటారు. వాటిని మెడలో వేసుకోవడం, నడుముకు చుట్టుకోవడం వంటి పనులతో ఆకట్టుకుంటూ ఉంటారు. అలాంటి వీడియోలు సోషల్‌ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారతాయి. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది ఓ వ్యక్తి కింగ్ కోబ్రా పామును పట్టుకున్న విధానం చూసి నెటిజన్స్‌ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. అరె భయ్యా.. పాము అనుకున్నావా..? పొట్ల కాయ అనుకున్నావా? బ్రో అంటూ పోస్టులు పెడుతున్నారు.

సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోన్న వీడియో ప్రకారం ఆ ఘటన థాయిలాండ్‌లో జరిగినట్లు తెలుస్తోంది. కింగ్ కోబ్రా ఎంత ప్రమాదకరమైందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ పాము ఒక్కసారి కాటేసిందంటే.. క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అయితే ఇలాంటి ప్రమాదకరమైన పాములను సైతం కొందరు స్నేక్ క్యాచర్లు ఎంతో సులభంగా పట్టుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో ఓ స్నేక్ క్యాచర్ కింగ్ కోబ్రాను పట్టుకున్న విధానం చూసి అంతా షాక్ అవుతున్నారు.

పడగ విప్పిన కింగ్ కోబ్రా వద్దకు స్కేక్‌ క్యాచర్‌ వెళతాడు. ముందుగా.. తన కాలును పాము దగ్గరగా తీసుకెళతాడు. దీంతో ఆ పాము అతన్ని కాటేయడానికి బుసలు కొట్టింది. అయితే ఇంతలో అతను తన చేయిని పాము తలపైకి తీసుకెళ్లి, ఒక్కసారిగా దాని మెడను ఒడుపుగా క్షణాల్లో పట్టేసుకుంటాడు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే ఒట్టి చేతులతో పామును ఎంతో సులభంగా పట్టుకున్న తీరును చూసి అక్కడున్న వారికి మైండ్‌ బ్లాంక్‌ అయినంత పని అయింది.

ప్రస్తుతం నెట్టింట చక్కర్లుతోన్న ఈ వీడియోపై నెటిజన్స్‌ ఫన్నీ కామెంట్స్‌ పెడుతున్నారు. అరె భయ్యా.. పాము అనుకున్నావా..? పొట్ల కాయ అనుకున్నావా? బ్రో అంటూ పోస్టులు పెడుతున్నారు.

వీడియో చూడండి:

ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!
ఏపీ ప్రభుత్వం మరో కొత్త హైవే.. హైదరాబాద్ వెళ్లేవారికి ఊరట
ఏపీ ప్రభుత్వం మరో కొత్త హైవే.. హైదరాబాద్ వెళ్లేవారికి ఊరట
ఎగ్జైటెడ్‌గా రామ్ చరణ్.. అభిమానులను మెప్పిస్తాడా?
ఎగ్జైటెడ్‌గా రామ్ చరణ్.. అభిమానులను మెప్పిస్తాడా?
1200 కోట్ల సినిమా.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరో.. మూడేళ్లకు..
1200 కోట్ల సినిమా.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరో.. మూడేళ్లకు..