Sovereign Gold Bonds: గోల్డ్ బాండ్స్ ఉన్న వారికి ఆర్‌బీఐ అలెర్ట్.. ప్రీ మెచ్యూర్ చేయాలనుకునే వారికి పండగే
బంగారం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులకు మంచి పెట్టుబడి ఎంపిక. ప్రపంచంలో ఉన్న అనిశ్చితి కారణంగా బంగారం విలువ భారీగా పెరుగుతుంది. ఈ సమయంలో చాలా మంది పెట్టుబడిదారులు బంగారాన్ని అమ్మేందుకు కూడా ఉత్సాహంగా చూపుతున్నారు. ఈ నేపథ్యంలో భారతదేవంలో గోల్డ్ బాండ్స్ ద్వారా పెట్టుబడి పెట్టిన వారికి ఆర్‌బీఐ గుడ్ న్యూస్ చెప్పింది.

సాధారణంగా భారతదేశంలో బంగారాన్ని ఆభరణాలు కిందే ఎక్కువ మంది కొంటూ ఉంటారు. అందువల్ల దేశంలో బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. బంగారం దిగుమతులను కంట్రోల్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గోల్డ్ బాండ్స్ జారీ మొదలుపెట్టింది. ముఖ్యంగా పెట్టుబడిలా బంగారం కొనుగోలు చేసే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడంతో పెద్ద సంఖ్యంలో ప్రజలు ఈ గోల్డ్ బాండ్స్‌ను కొనుగోలు చేశారు. అయితే ఎస్‌జీబీలో పెట్టుబడి పెట్టి, దానిని ముందస్తుగా రీడీమ్ చేసుకోవాలని ప్లాన్ చేసే ఆర్‌బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 2025 కోసం ఎస్‌జీబీ ప్రీ మెచ్యూర్ తేదీలను ప్రకటించింది. ఈ ప్రకటన ద్వారా మూడు ఎస్‌జీబీ సిరీస్‌ల మెచ్యూరిటీ కంటే ముందే ఉపసంహరించుకునేందుకు అవకాశం ఇచ్చారు.
ప్రీ మెచ్యూర్ అయ్యే బాండ్లు ఇవే
ఆర్‌బీఐ తెలిపిన వివరాల ప్రకారం మూడు సిరీస్‌ల ఎస్‌జీబీ బాండ్రలను ఏప్రిల్ 2025 నాటికి ముందస్తుగా రీడీమ్ చేసుకోవచ్చు. ఎస్‌జీబీ 2017-18 సిరీస్ III బాండ్లు అంటే అక్టోబర్ 16, 2017న జారీ చేశారు. ఈ బాండ్లను ఏప్రిల్ 16, 2025న విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎస్‌జీబీ 2017-18 సిరీస్ IV బాండ్లను అక్టోబర్ 23, 2017న జారీ చేశారు. ఈ బాండ్లను ఏప్రిల్ 23, 2025న ప్రీ మెచ్యూర్ స్కీమ్‌లో భాగంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎస్‌జీబీ 2017-18 సిరీస్ V బాండ్లను ఇది అక్టోబర్ 30, 2017న జారీ చేశారు. వీటిని ఏప్రిల్ 30, 2025న ఉపసంహరించుకోవచ్చు.
ప్రీ మెచ్యూర్ ధర నిర్ణయం ఇలా
ఎస్‌జీబీ పథకం కింద ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ ప్రచురించిన గత మూడు ట్రేడింగ్ రోజులలో 999 స్వచ్ఛత కలిగిన బంగారం సగటు ధర ఆధారంగా బంగారు బాండ్ల ప్రీ మెచ్యూర్ ధర నిర్ణహిస్తారు. ఈ ఎస్‌జీబీ పథకాన్ని 2015-16 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించారు. చివరి ఎస్‌జీబీ బాండ్లను ఫిబ్రవరి 2024లో జారీ చేశారు. ఈ పథకం కింద, పెట్టుబడిదారులు పెరుగుతున్న బంగారం ధరల ప్రయోజనాన్ని పొందడంతో పాటు ఏటా 2.5 శాతం వడ్డీని కూడా పొందవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..