AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ISRO Jobs 2025: ఎలాంటి రాత పరీక్షలేకుండానే ఇస్రోలో ఉద్యోగాలు పొందే ఛాన్స్.. ఇలా దరఖాస్తు చేసుకోండి

ఇస్రో ఆధ్వర్యంలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌.. విద్యార్ధులకు అద్భుత అవకాశం ఇచ్చింది. ఇస్రోలో జూనియర్ రీసెర్చ్‌ ఫెలో, రీసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు..

ISRO Jobs 2025: ఎలాంటి రాత పరీక్షలేకుండానే ఇస్రోలో ఉద్యోగాలు పొందే ఛాన్స్.. ఇలా దరఖాస్తు చేసుకోండి
ISRO Jobs
Srilakshmi C
|

Updated on: Mar 25, 2025 | 6:49 AM

Share

బెంగళూరులోని ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) ఆధ్వర్యంలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌.. విద్యార్ధులకు అద్భుత అవకాశం ఇచ్చింది. ఇస్రోలో జూనియర్ రీసెర్చ్‌ ఫెలో, రీసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఎవరైనా ఏప్రిల్ 20, 2025వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 23 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ పోస్టులు 21, రీసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టులు 02 ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్‌, ఎంఎస్సీ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం కూడా ఉండాలి. వయోపరిమితి కింద ఏప్రిల్ 20, 2025 నాటికి జూనియర్ రీసెర్చ్‌ ఫెలోకు 28 ఏళ్లు, రీసెర్చ్‌ అసోసియేట్‌కు 35 ఏళ్ల లోపు వయసు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ ద్వారా ఏప్రిల్ 20, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైతే జూనియర్ రీసెర్చ్‌ ఫెలోకు నెలకు రూ.37,000, రీసెర్చ్‌ అసోసియేట్‌కు నెలకు రూ.58,000 చొప్పున స్టైపెండ్‌ ఇస్తారు. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

రేషన్ కార్డు ఉన్నవారి అకౌంట్లోకి నేరుగా డబ్బులు.. ప్రభుత్వం నుంచి
రేషన్ కార్డు ఉన్నవారి అకౌంట్లోకి నేరుగా డబ్బులు.. ప్రభుత్వం నుంచి
గుడ్డులోని పచ్చసొన తింటే ఏమవుతుంది..? ఈ నిజాలు తెలిస్తే మళ్లీ..
గుడ్డులోని పచ్చసొన తింటే ఏమవుతుంది..? ఈ నిజాలు తెలిస్తే మళ్లీ..
టెడ్డీని కౌగిలించుకుంటే ఇంత సుఖమా? టెడ్డీ డే స్పెషల్ స్టోరీ
టెడ్డీని కౌగిలించుకుంటే ఇంత సుఖమా? టెడ్డీ డే స్పెషల్ స్టోరీ
ధోని, కోహ్లీలు ఒంట్లో పూనారా.. అసలేంది ఈ క్లాస్ ఫినిషింగ్‌
ధోని, కోహ్లీలు ఒంట్లో పూనారా.. అసలేంది ఈ క్లాస్ ఫినిషింగ్‌
ఇరుముడి మూవీకి రవితేజ ఫస్ట్ ఛాయిస్ కదా..
ఇరుముడి మూవీకి రవితేజ ఫస్ట్ ఛాయిస్ కదా..
బాడీ మిస్టరీ.. జుట్టు, గోళ్లు కత్తిరిస్తే నొప్పి ఎందుకు ఉండదో..
బాడీ మిస్టరీ.. జుట్టు, గోళ్లు కత్తిరిస్తే నొప్పి ఎందుకు ఉండదో..
ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్
ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్
లైట్ తీసుకుంటారు కానీ.. దివ్యౌషధం.. ఉదయాన్నే ఒక్కటి తింటే చాలు..
లైట్ తీసుకుంటారు కానీ.. దివ్యౌషధం.. ఉదయాన్నే ఒక్కటి తింటే చాలు..
ఆధార్, పాన్ ఉందా..? రూ.5 లక్షల లోన్ పొందండి
ఆధార్, పాన్ ఉందా..? రూ.5 లక్షల లోన్ పొందండి
ఏం చూస్తున్నారా.. ? 14 ఏళ్లుగా యూట్యూబ్‌ను ఊపేస్తున్న సినిమా..
ఏం చూస్తున్నారా.. ? 14 ఏళ్లుగా యూట్యూబ్‌ను ఊపేస్తున్న సినిమా..