Green Chillies: పచ్చి మిర్చి ఘాటు.. ఆరోగ్యానికి బలేగా గిట్టుబాటు! రోజూ తింటున్నారా..?
పచ్చి మిర్చిని వినియోగంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందని, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు ఒంటికి బలంగా పడతాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా పచ్చి మిరపకాయలను బాగా నమలడం వల్ల నోటిలో లాలాజలం స్రావం పెరుగుతుందట..

పచ్చి మిరపకాయలను కేవలం వంటకాలకు రుచిని జోడించడానికి మాత్రమే కాకుండా ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పచ్చి మిరపకాయలను బాగా నమలడం వల్ల నోటిలో లాలాజలం స్రావం పెరుగుతుంది. ఇది ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడానికి కూడా సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. ఈ విధమైన ఆహార అలవాట్లు జీర్ణక్రియను మెరుగుపరచడంతోసహా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని అంటున్నారు. పచ్చి మిరపకాయల్లో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి హృదయ స్పందన రేటును సమతుల్యం చేయడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఇది గుండె ఆరోగ్యానికి, రక్తపోటును నియంత్రించడానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతారు.
పచ్చి మిరపకాయల్లో ఉండే విటమిన్ సి శరీరం ఐరన్‌ను మరింత సమర్థవంతంగా గ్రహించడానికి సహాయపడుతుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను సమతుల్యం చేస్తుందని, రక్తహీనత సమస్యలను తగ్గిస్తుందని చెబుతున్నారు. ఇది శరీర శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. పచ్చి మిరపకాయలను ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. ఇది మధుమేహంతో బాధపడేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే దీనిలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
పచ్చి మిరపకాయల్లో సిలికాన్ పుష్కలంగా ఉంటుంది. ఇది తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుందని, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుందని చెబుతున్నారు. అదేవిధంగా ఈ విటమిన్ చర్మంలో నూనె స్రావాన్ని ప్రేరేపిస్తుంది. చర్మాన్ని తేమగా ఉంచుతుంది. పచ్చిమిర్చిలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చర్మ వ్యాధులను నివారిస్తాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంచడంలో సహాయపడతాయి. కొంతమంది నిపుణులు పచ్చి మిరపకాయలు ఆహారంలో తీసుకుంటే ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి సమస్యలను కూడా నివారిస్తుందని చెబుతున్నారు.
గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారం కోసం మాత్రమే. మరింత సమాచారం కోసం వైద్యుడిని సంప్రదించడం మర్చిపోవద్దు.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.