AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beer prices: బీర్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరగనున్న ధరలు..

Beer prices: బీర్ ప్రియులకు చేదు వార్త. వేసవిలో చల్లటి బీర్ తాగి చిల్ అవుదామనుకుంటున్న వారిపై రేట్ల భారం(Beer rates hike) పడనుంది. ఇకపై బీర్ ప్రియులు జేబులకు చిల్లు పడనుంది. ఎందుకంటే..

Beer prices: బీర్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరగనున్న ధరలు..
Beer
Ayyappa Mamidi
|

Updated on: Apr 26, 2022 | 9:26 PM

Share

Beer prices: బీర్ ప్రియులకు చేదు వార్త. వేసవిలో చల్లటి బీర్ తాగి చిల్ అవుదామనుకుంటున్న వారిపై రేట్ల భారం(Beer rates hike) పడనుంది. ఇకపై బీర్ ప్రియులు జేబులకు చిల్లు పడనుంది. ఎందుకంటే.. బీర్ తయారీ కంపెనీలు రేట్లను 10 నుంచి 15 శాతం వరకు పెంచాలని భావిస్తున్నాయి. బీర్ల తయారీలో వినియోగించే బార్లీ రేట్లతో పాటు ఇతర ముడి పదార్థాల రేట్ల పెరుగుదలే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. బీర్ తయారీలో కీలకమైన బార్లీ(Barley) ధరలు గత సంవత్సరం కాలంలో 65 శాతం మేర పెరిగాయి. వీటికి తోడు డిస్టిలరీ కంపెనీలు పెరుగుతున్న రవాణా, ప్యాకేజింగ్ ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దేశంలో బీర్ల రేట్లను రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రిస్తాయి. ఇప్పటికే తెలంగాణ, హర్యాణా రాష్ట్రాలు బీర్ రేట్లను పెంచాయి. మరిన్ని రాష్టాలు కూడా ఇదే బాటలో నడవనున్నాయి.

సహజంగా వేసివి కాలమైన మార్చి నుంచి జులై మధ్య కాలంలో ఏడాది మెుత్తం అమ్మకాల్లో 40 నుంచి 45 శాతం సేల్స్ జరుగుతుంది. ఈ తరుణంలో రేట్లను పెంచటం వల్ల ఆ ప్రభావం అమ్మకాలపై పడనుందని తెలుస్తోంది. తయారీలో వినియోగించే ముడి పదార్థాలపై ద్రవ్యోల్బణ ప్రభావం అత్యధిక స్థాయిలో ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకోక తప్పటం లేదని Bira 91 బీర్ల తయారీ సంస్థ సీఈవో అంకూర్ జైన్ చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని మార్కెట్లలో ధరలను పెంచినట్లు ఆయన తెలిపారు. ఖర్చులను తగ్గించుకోవటం, ప్రాడక్ట్ మిక్స్ మ్యానేజ్ మెంట్ పై ప్రధానంగా దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. దీని వల్ల పెరుగుతున్న తయారీ ఖర్చుల ప్రభావాన్ని తగ్గించటానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది మార్చిలో భారతదేశం వరుసగా 12 నెలల రెండంకెల టోకు ధరల ద్రవ్యోల్బణాన్ని పూర్తి చేసింది. ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ద్రవ్యోల్బణం 10% కంటే ఎక్కువగా ఉండడం ఇది ఆరోసారి.

ఇవీ చదవండి..

Sri lanka Crisis: శ్రీలంక ఆర్థిక సంక్షోభం నేర్పిన పాఠాలు.. రాష్ట్రాల రుణాలకు అడ్డుకట్ట వేయాల్సిందే..

Russia Ukraine war: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. యూరఫ్ దేశాలకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన భారత్..

LIC IPO Price Band: LIC ఐపీవో అప్ డేట్.. ఒక్కో షేరు రేటు, పాలసీదారులకు డిస్కౌంట్ ఎంతంటే..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..