Acharya: సిద్ధ పాత్రకు ముందుగా మహేష్ బాబును అనుకున్నారా ?.. అసలు విషయం చెప్పేసిన డైరెక్టర్..

మెగా అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఆచార్య (Acharya) సినిమ మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. చరణ్, చిరు కాంబోలో

Acharya: సిద్ధ పాత్రకు ముందుగా మహేష్ బాబును అనుకున్నారా ?.. అసలు విషయం చెప్పేసిన డైరెక్టర్..
Koratala Shiva
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 27, 2022 | 12:31 PM

మెగా అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఆచార్య (Acharya) సినిమ మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. చరణ్, చిరు కాంబోలో మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఏప్రిల్ 29న ఈ మూవీ విడుదల కాబోతుండడంతో… ఇప్పటికే ప్రమోషన్లలో వేగం పెంచింది చిత్రయూనిట్. ప్రీరిలీజ్ ఈవెంట్.. మీడియా సమావేశాలు అంటూ హడావిడి చేస్తున్నారు. అయితే ముందునుంచి ఈ సినిమాలో మహేష్ బాబు కూడా ఓ భాగమయ్యారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పాదఘట్టం మహేష్ బాబు వాయిస్ తో పరిచయం కాబోతున్నట్లు ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే ముందుగా ఈ సినిమాలో సిద్ధ పాత్రకు మహేష్ ను అనుకున్నారని.. కానీ అనుహ్యంగా రామ్ చరణ్ ను తీసుకున్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక ఇదే విషయాన్ని ఓ విలేకరి నేరుగా డైరెక్టర్ కొరటాల శివను అడగ్గా.. తనదైన స్టైల్లో ఆన్సర్ ఇచ్చారు డైరెక్టర్.

ఈ సినిమాలో సిద్ధ పాత్ర కోసం మహేష్ బాబును ఎంపిక చేశారని.. అయితే మహేష్ డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో.. రామ్ చరణ్ ను తీసుకున్నట్లు ఫిల్మ్ చక్కర్లో వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సోమవారం నాడు నిర్వహించిన మీడియా సమావేశంలో మహేష్ బాబు గురించిన ప్రశ్నలు అడిగారు. సిద్ధ పాత్రకు మహేష్ బాబును అనుకున్నారు. తర్వాత రామ్ చరణ్ ఎలా తీసుకుని వచ్చారు ? అని విలేకరి అడగంతో కొరటాల శివ సమాధానమిచ్చారు. మహేష్ భాబు అని మీరు మాత్రమే అనుకున్నారు.. నేను కాదు.. మీరు అనుకున్న దానికి నన్ను అడిగితే నేనేలా సమాధానం చెప్తాను.. ఈ సినిమా కథ మొదట ఏం అనుకున్నామో అదే తీశాం.. ఒక్కసీన్ కూడా మార్చలేదు.. ఎక్స్ ట్రా తీయలేదు. చాలా క్లియర్ గా ఉంది.. ఈ పాత్రకు రామ్ చరణ్ అనుకున్నాం.. ఆయనతోనే తీశాం అంటూ చెప్పుకొచ్చారు. ఈ మూవీలో పూజా హెగ్డే కీలకపాత్రలో నటించింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన తమన్.. స్కోర్ స్టార్ట్ అంటూ పోస్ట్..

Viral Photo: చంద్రబింబంలాంటి ఈ చిన్నది.. హీరోయిన్ మాత్రమే కాదు.. నిర్మాతగానూ రాణిస్తోంది.. ఎవరో గుర్తుపట్టండి..

RRR: ఎత్తర జెండా ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది.. అదరగొట్టిన చరణ్, తారక్..

Salaar Movie: ప్రభాస్ కోసం ప్రశాంత్ నీల్ భారీ ప్లాన్.. ఇంటర్వెల్ సిక్వెన్స్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో తెలుసా..