Ugadi Tollywood: ఉగాదికి వచ్చేసిన స్పెషల్ అప్డేట్స్.. డెవిల్ అంటున్న కళ్యాణ్ రామ్.. ఆసక్తిగా చైతూ కస్టడీ పోస్టర్…

తెలుగువారి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అటు టాలీవుడ్ మేకర్స్ సినీ ప్రియులకు స్పెషల్ అప్డేట్స్ షేర్ చేస్తున్నారు. నందమూరి నటసింహం బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న కొత్త ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

Ugadi Tollywood: ఉగాదికి వచ్చేసిన స్పెషల్ అప్డేట్స్.. డెవిల్ అంటున్న కళ్యాణ్ రామ్.. ఆసక్తిగా చైతూ కస్టడీ పోస్టర్...
Kalyan Ram , Naga Chaitanya
Follow us

|

Updated on: Mar 22, 2023 | 12:36 PM

తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. తెల్లవారుజామున నుంచే ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగిపోయింది. భక్తి శ్రద్ధలతో ఉగాది పచ్చడిని స్వీకరిస్తున్నారు. తెలుగువారి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అటు టాలీవుడ్ మేకర్స్ సినీ ప్రియులకు స్పెషల్ అప్డేట్స్ షేర్ చేస్తున్నారు. నందమూరి నటసింహం బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న కొత్త ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక మరో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ సైతం తన కొత్త ప్రాజెక్ట్ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. డెవిల్ పేరుతో రాబోతున్నారు కళ్యాణ్

ఇక సందీప్ కిషన్ నటిస్తున్న ఊరి పేరు భైరవకోన, సుధీర్ బాబు నటిస్తున్న మామా మశ్చీంద్ర, మంచు లక్ష్మి నటిస్తున్న అగ్న నక్షత్రం, నాగాశౌర్య నటిస్తున్న రంగ బలి చిత్రాల నుంచి స్పెషల్ పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. అలాగే మ్యాచో స్టార్ గోపిచంద్ నటిస్తోన్న రామబాణం, వరుణ్ తేజ్ నటిస్తున్న అర్జున, నాని నటిస్తున్న సినిమాల నుంచి ఉగాది పోస్టర్స్ రిలీజ్ చేశారు. మరీ ఉగాది కానుకగా మేకర్స్ ఇచ్చిన స్పెషల్ అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూసేయ్యండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.