Tollywood: బాలయ్య పక్కన ఉన్న ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో గుర్తుపట్టారా ?.. నందమూరి స్టార్ హీరో..
ప్రస్తుతం సోషల్ మీడియాలో తారల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. త్రోబ్యాక్ ట్రెండ్ పేరుతో చైల్డ్ హుడ్ పిక్స్ నెట్టింట హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఓ చైల్డ్ ఆర్టిస్ట్ ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. పైన ఫోటోను చూశారు కదా ?.

ప్రస్తుతం సోషల్ మీడియాలో తారల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. త్రోబ్యాక్ ట్రెండ్ పేరుతో చైల్డ్ హుడ్ పిక్స్ నెట్టింట హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఓ చైల్డ్ ఆర్టిస్ట్ ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. పైన ఫోటోను చూశారు కదా ?. ఆ కుర్రాడు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ స్టార్. నందమూరి కుటుంబం నుంచి కథానాయికుడిగా అడుగుపెట్టి సక్సెస్ అయ్యారు. ఇటీవలే సూపర్ హిట్ అందుకున్నారు. ఈ హీరోకు స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తనే హీరో కళ్యాణ్ రామ్. దివంగత నటుడు హరికృష్ణ తనయుడు. జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు. 2003లో తొలిచూపులోనే సినిమాతో హీరోగా అరంగేట్రం చేశాడు కళ్యాణ్ రామ్. అదే ఏడాదిలో అభిమన్యు సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఈ సినిమాలు అంతగా హిట్ కాలేదు.
ఇక ఆ తర్వాత 2007లో వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ తనను తాను నిరూపించుకున్నాడు కళ్యాణ్ రామ్. ఇటీవల వరుసగా హిట్స్ అందుకుంటూ ఫుల్ ఫాంలో దూసుకుపోతున్నారు. గతేడాది బింబిసారా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు కళ్యాణ్ రామ్. ఇందులో సంయుక్త మీనన్ కథానాయికగా నటించింది.




ఇక ఆ తర్వాత ఈ ఏడాది వచ్చిన అమిగోస్ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ డెవిల్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మరోసారి సంయుక్త హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈరోజు (జూలై 5న) కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన డెవిల్ టీజర్ ఆకట్టుకుంది.
Here is the Glimpse of #Devil. #DevilGlimpse 🔥 – https://t.co/eovihwMI9d@iamsamyuktha_ @NaveenMedaram @soundar16 @SrikanthVissa @rameemusic @vasupotini @mohitrawlyani @AbhishekPicture pic.twitter.com/cwEqgKzdPE
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) July 5, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




