AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV Actress : విడిపోయిన బుల్లితెర జంట.. విడాకులు తీసుకున్న సీరియల్ కపుల్.. కారణం ఇదే..

సినీరంగంలో ప్రేమ, పెళ్లి, విడాకులు ఇప్పుడు కామన్ గా వినిపిస్తున్న మాటలే. ఓవైపు కొందరు నటీనటులు వివాహం చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు. మరికొందరు తమ విడాకులను ప్రకటిస్తున్నారు. తాజాగా బుల్లితెర జంట తమ ఏడడుగుల బంధం ముగిసిందని తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

TV Actress : విడిపోయిన బుల్లితెర జంట.. విడాకులు తీసుకున్న సీరియల్ కపుల్.. కారణం ఇదే..
Anusha Hegde
Rajitha Chanti
|

Updated on: Jan 26, 2026 | 10:53 PM

Share

సినిమా పరిశ్రమలో విడాకులు సర్వసాధారణం అయిపోయాయి . ఇటీవల టీవీ ప్రపంచంలో కూడా డివోర్స్ అనే మాట కామన్ గా వినిపిస్తుంది. టీవీ ప్రపంచంలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న తారలు నిజ జీవితంలో మాత్రం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఓ సీరియల్ హీరోయిన్ తన భర్తతో విడాకులు తీసుకుంది. ఆమె పేరు అనుషా హెగ్డే. తన ఆరు సంవత్సరాల వైవాహిక బంధం ముగిసిందని తెలుపుతూ పోస్ట్ చేసింది. ‘నిన్నే పెళ్ళాడత’ అనే తెలుగు సీరియల్ లో నటిస్తుండగా, అనూష హెగ్డే తన సహనటుడు ప్రతాప్ సింగ్ తో ప్రేమలో పడి, తరువాత అతన్ని వివాహం చేసుకుంది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో తోపు యాక్టర్.. ఈ నటుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే..

అప్పట్లో అనుషా హెగ్డే, ప్రతాప్ సింగ్ ల వివాహం సంచలనంగా మారింది. ఫిబ్రవరి 2020లో హైదరాబాద్ లోని తారామతి బారాదరి ప్యాలెస్ లో జరిగింది. టీవీ, సినిమా రంగాలకు చెందిన చాలా మంది ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. ‘2023 నుండి మా వివాహంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నామని చాలా మందికి తెలుసు. ఇప్పుడు 2025 లో, మేము అధికారికంగా, చట్టబద్ధంగా విడిపోయాము.’ ఈ విషయం గురించి పెద్దగా చర్చించకూడదు” అంటూ రాసుకొచ్చింది.

ఎక్కువ మంది చదివినవి : Mahesh Babu : సినిమా సూపర్ హిట్టు.. అయినా రెమ్యునరేషన్ వద్దన్న మహేష్.. కారణం ఇదే..

2016లో ‘NH 37’ సినిమాలో అనూష హెగ్డే నటించింది. మంచి డ్యాన్సర్ అయిన అనూష ‘బన్న బన్న బద్బు’ సినిమాకు కొరియోగ్రఫీ చేసింది. 2017లో ప్రసారమైన ‘రాధా రమణ’ సీరియల్‌లో నటించింది. 2018లో ‘నిన్నే పెళ్లాడుత’ ‘సూర్యకాంతం’ వంటి సీరియల్స్ చేసింది.

ఎక్కువ మంది చదివినవి : Devi Movie: అతడు పవర్ ఫుల్ SI.. కట్ చేస్తే.. దేవి సినిమాలో విలన్.. అసలు విషయాలు చెప్పిన డైరెక్టర్..

ఎక్కువ మంది చదివినవి : ఏం సినిమా రా బాబూ.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతుంటారు.. 22 సంవత్సరాలుగా బాక్సాఫీస్ కింగ్..