AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Chandrakanth Wife: ఆమె మోజులో పడి నన్ను, పిల్లల్ని వదిలేసాడు.. కన్నీళ్లు పెట్టుకున్న చంద్రకాంత్‌ భార్య

పవిత్ర మృతిని తట్టుకోలేకపోయిన చంద్రకాంత్‌ శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే చంద్ర కాంత్ గతంలో శిల్ప అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొంతకాలంగా చంద్రకాంత్ పవిత్ర జయరామ్ తో రిలేషన్ లో ఉన్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరి మరణంతో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.

Actor Chandrakanth Wife: ఆమె మోజులో పడి నన్ను, పిల్లల్ని వదిలేసాడు.. కన్నీళ్లు పెట్టుకున్న చంద్రకాంత్‌ భార్య
Actor Chandrakanth
Rajeev Rayala
|

Updated on: May 18, 2024 | 11:47 AM

Share

సీరియల్ నటుడు చందు ఆత్మహత్య సంచలనంగా మారింది. సీరియల్ నటి పవిత్ర జయరామ్ గత ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఇదే ప్రమాదంలో ఆమె ప్రియుడు, సీరియల్ నటుడు చంద్రకాంత్‌ గాయపడ్డాడు. పవిత్ర మృతిని తట్టుకోలేకపోయిన చంద్రకాంత్‌ శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే చంద్ర కాంత్ గతంలో శిల్ప అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొంతకాలంగా చంద్రకాంత్ పవిత్ర జయరామ్ తో రిలేషన్ లో ఉన్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరి మరణంతో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. కాగా చందు ఆత్మహత్య  పై అతని భార్య శిల్ప స్పందించారు. అయిదేళ్లుగా సీరియల్ నటి పవిత్ర తో చందు సహజీవనం చేస్తున్నాడని ఆమె అన్నారు.

శిల్ప మాట్లాడుతూ.. చందు నా వెంటపడి ప్రేమించి నన్ను పెళ్లి చేసుకున్నాడు. మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. త్రినయని సీరియల్ ప్రాజెక్ట్ వచ్చిన దగ్గర నుంచి చందుకు పవిత్రతో సంబంధం మొదలైంది. పవిత్రతో రిలేషన్ లో ఉంటూ నన్ను పిల్లల్ని వదిలేసాడు. చందు నాతో ఐదేళ్ల నుండి మాట్లాడట్లేదు అంటూ ఎమోషనల్ అయ్యారు శిల్ప. అలాగే పెళ్లి అయ్యాక కూడా వేరే మహిళా తో కొనసాగించే సంబందాలు చాల మంది జీవితాలను నాశనం చేస్తున్నాయి. పవిత్ర మీద విపరీతమైన ప్రేమ పెంచుకున్నాడు. కానీ పవిత్ర కు చందు కాకుండ ముందు చాల రిలేషన్స్ ఉన్నాయి అని అన్నారు శిల్ప.

పవిత్ర మాయ లో పడి చందు ఈ విధంగా అయ్యాడు. పవిత్ర సడెన్ గా చనిపోవడంతో.. డిప్రెషన్ లో ఉన్నాడు. మూడు రోజుల క్రితం చేయి కోసుకున్నాడు. పవిత్ర నీ దగ్గరికి వస్తున్నా అంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెట్టాడు. నిన్న మా ఇంట్లో వాళ్ల ఫోన్లు కూడా లిఫ్ట్ చేయకపోవడంతో తన ఫ్లాట్ కి మాకు తెలిసిన వాళ్ళని పంపించాము. అక్కడ డోర్ పగలగొట్టి చూస్తే.. సూసైడ్ చేసుకొని ఉన్నాడని కన్నీళ్లు పెట్టుకున్నారు శిల్ప.

సీరియల్ యాక్టర్ చందు తండ్రి వెంకటేష్ మ్దట్లాడు.. పవిత్ర తో రిలేషన్ ఉన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, పిల్లల్ని వదిలేశాడు. గత ఐదేళ్లుగా చందు మా ఇంటికి రాలేదు. పవిత్ర చనిపోయిన తర్వాత డిప్రెషన్ లోకి వెళ్ళాడు. మూడురోజుల క్రితం మా ఇంటికి వచ్చాడు.. పవిత్ర దగ్గరికి వెళ్లిపోతున్నా అని చెప్పాడు. అలా చేసుకోవద్దని చెప్పాం. శుక్రవారం పొద్దున లకడికపూల్ వెళ్లి వస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. కాల్స్ చేసినా లిఫ్ట్ చేయలేదు. మాకు తెల్సిన వ్యక్తిని చందు ఫ్లాట్ కి పంపించాము. డోర్ పగలగొట్టి చూస్తే బాల్కనీ లో సూసైడ్ చేసుకొని ఉన్నాడు. మేము వెళ్లేసరికి పోలీసులు వచ్చారు. పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తీసుకెళ్లారు అని తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.