మోహన్ బాబు దాడిలో తీవ్రంగా గాయపడిన టీవీ9 ప్రతినిధి.. జైగోమాటిక్ బోన్ మూడు చోట్ల ప్రాక్చర్

టీవీ 9 ప్రతినిధి రంజిత్ పై విచక్షణ రహితంగా మోహన్ బాబు దాడిచేశారు. ముందు వెనక చూడకుండా టీవీ9 మైక్ లాక్కొని దాడికి తెగబడ్డారు మోహన్ బాబు. ఈ దాడి లో టీవీ9, టీవీ5 ప్రతినిధులకు గాయాలు అయ్యాయి.

మోహన్ బాబు దాడిలో తీవ్రంగా గాయపడిన టీవీ9 ప్రతినిధి.. జైగోమాటిక్ బోన్ మూడు చోట్ల ప్రాక్చర్
Mohanbabu attack on Reporter
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 10, 2024 | 9:21 PM

మోహన్ బాబు మీడియా పై దాడి చేయడం సంచలనం గా మారింది. విచక్షణ మరిచి మీడియా దాడి చేశారు మోహన్ బాబు. జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఇంటికి వెళ్లారు మంచు మనోజ్‌. తన కూతుర్ని చూడనివ్వడం లేదని వెళ్తూ వెళ్తూ మీడియాను వెంటబెట్టుకెళ్లారు మనోజ్‌. ఈ క్రమంలో మనోజ్ లోనికి రానివ్వకుండా గేట్లు వేశారు సెక్యూరిటీ. దాంతో ఆవేశంగా మనోజ్ గేట్లు బద్దలు కొడుతూ లోనికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈక్రమంలో బయటకు వచ్చిన మోహన్ బాబు ఆవేశంతో మీడియాపై దాడి చేశారు.

టీవీ 9 ప్రతినిధి రంజిత్ పై విచక్షణ రహితంగా మోహన్ బాబు దాడిచేశారు. ముందు వెనక చూడకుండా టీవీ9 మైక్ లాక్కొని దాడికి తెగబడ్డారు మోహన్ బాబు. ఈ దాడి లో టీవీ9, టీవీ5 ప్రతినిధులకు గాయాలు అయ్యాయి. మీడియా ప్రతినిధులపై దాడి చేసిన మోహన్ బాబు క్షమాపణ చెప్పాలని మీడియా ప్రతినిధుల డిమాండ్ చేశారు.

మోహన్ బాబు ఇంటి ముందు మీడియా ప్రతినిధుల ధర్నా చేపట్టారు. మోహన్ బాబు మీడియాపై దాడి వెంటనే క్షమాపణ చెప్పాలని, ప్రేక్షక పాత్ర వహించిన పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలి మీడియా ప్రతినిధుల మీడియా ప్రతినిధులు డిమాండ్ చేశారు. మోహన్ బాబు చేసిన దాడిలో టీవీ9 ప్రతినిధి రంజిత్ కు తీవ్ర గాయాలయ్యాయి. కంటికి చెవికి మధ్య తీవ్ర గాయం అయ్యింది. నొప్పితో విలవిలలాడుతూ శంషాబాద్ ఆస్పత్రిలో చేరాడు రంజిత్. జైగోమాటిక్ బోన్ మూడు చోట్ల ప్రాక్చర్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి ఉంటుందని తెలిపిన వైద్యులు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.