AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohan Babu Attack: చేతులారా ఇజ్జత్ తీసుకున్న మోహన్ బాబు.. మీడియాపై దాడికి ముందు అసలేం జరిగిందంటే..

టీవీ9, టీవీ5 ప్రతినిధులపై మోహన్ బాబు రెచ్చిపోయారు.. అందరిముందే మోహన్‌బాబు పరుషపదజాలంతో నోటికొచ్చిన విధంగా మీడియా ప్రతినిధులను తిడుతూ.. దాడి చేశారు.. మోహన్‌బాబు దాడిలో టీవీ9 ప్రతినిధికి తీవ్ర గాయాలయ్యాయి..

Mohan Babu Attack: చేతులారా ఇజ్జత్ తీసుకున్న మోహన్ బాబు.. మీడియాపై దాడికి ముందు అసలేం జరిగిందంటే..
Mohan Babu Attack
Shaik Madar Saheb
|

Updated on: Dec 10, 2024 | 9:24 PM

Share

మంచు ఫ్యామిలీలో గొడవలు పీక్స్‌కి చేరాయ్‌. ఒకవైపు మోహన్‌బాబు.. ఇంకోవైపు మంచు మనోజ్‌.. ఢీ అంటే ఢీ అంటున్నారు. పరస్పర ఫిర్యాదులతో ఫ్యామిలీ ఫైట్‌ని నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకెళ్లారు ఇద్దరు. చిన్నకొడుకు నుంచి తనకు ప్రాణహాని ఉందని మోహన్‌బాబు అంటుంటే.. తన తండ్రివి అసత్య ఆరోపణలు అంటున్నారు మనోజ్‌.. ఈ క్రమంలోనే.. మోహన్ బాబు మీడియా పై దాడి చేయడం కలకలం రేపింది.. తన కూతుర్ని చూడనివ్వడం లేదని మనోజ్ మీడియాను మోహన్ బాబు ఇంటికి దగ్గరకు తీసుకెళ్లగా.. మోహన్ బాబు ఆగ్రహంతో మీడియాపై దాడి చేసి.. విచక్షణారహితంగా ప్రవర్తించారు.

టీవీ9, టీవీ5 ప్రతినిధులపై మోహన్ బాబు రెచ్చిపోయారు.. అందరిముందే మోహన్‌బాబు పరుషపదజాలంతో నోటికొచ్చిన విధంగా మీడియా ప్రతినిధులను తిడుతూ.. దాడి చేశారు.. మోహన్‌బాబు దాడిలో టీవీ9 ప్రతినిధికి తీవ్ర గాయాలయ్యాయి.. మోహన్ బాబుతో పాటు.. ఆయన బౌన్సర్లు కూడా రెచ్చిపోయారు.. వారు కూడా మీడియా ప్రతినిధులపై రెచ్చిపోయారు.. మోహన్ బాబు దాడిలో జైగోమాటిక్ ఎముక మూడు చోట్ల విరిగింది. కంటికి, చెవికి మధ్య గాయాలయ్యాయి.

దాడికి ముందు అసలేం జరిగిందంటే..

  • జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఇంటికి వెళ్లారు మంచు మనోజ్‌
  • తన కూతుర్ని చూడనివ్వడం లేదని వెళ్తూ వెళ్తూ మీడియాను వెంటబెట్టుకెళ్లారు మనోజ్‌.
  • ఎంతకీ ఫామ్‌హౌస్‌ గేట్లు తియ్యకపోవడంతో బద్దలుకొట్టి మరీ లోనికి ఎంటర్ అయ్యారు మనోజ్
  • మనోజ్‌ లోనికి ఎంటర్‌కాగానే ఒక్కసారిగా మోహన్‌బాబు దాడి మనుషులు దాడి చేశారు.
  • తన మీద దాడి జరుగుతోందని పక్కనే ఉన్న మీడియాకు తన బాధను చెప్పే ప్రయత్నం చేశారు మనోజ్‌..
  • ఇంతలో, మీడియాతో మాట్లాడటం నచ్చని మోహన్‌బాబు ఆవేశంగా వచ్చారు.
  • అదే సమయంలో మోహన్‌బాబు వెర్షన్ కూడా తీసుకుని ప్రయత్నం చేశారు టీవీ9 ప్రతినిధి రంజిత్
  • సర్ చెప్పండి అనేలోపే.. మైక్‌ను ఆవేశంగా లాక్కుని టీవీ9 ప్రతినిధి రంజిత్‌పై తీవ్రంగా దాడి చేశారు
  • టీవీ9 ప్రతినిధిపైనే కాదు, టీవీ5 ప్రతినిధిపైన కూడా ఎటాక్ చేశారు మోహన్‌బాబు
  • సొంత కొడుకు మనోజ్‌పైన కూడా విచ్చలవిడిగా చెలరేగిపోయారు
  • కనీసం తన కూతుర్ని కూడా చూడనివ్వకుండా మనుషుల్ని పెట్టి కొట్టిస్తున్నారంటూ మనోజ్‌ కూడా ఆవేదన వ్యక్తం చేశారు

మోహన్ బాబు మీడియాపై దాడి చేయడంతో జర్నలిస్టులు ఆయన ఇంటి దగ్గర ఆందోళనకు దిగారు..

లైవ్ వీడియో చూడండి..