Charmy Kaur: ముగిసిన విచారణ.. ఈడీ అధికారులకు పూర్తిగా సహకరిస్తానన్న హీరోయిన్ చార్మి కౌర్

Rajeev Rayala

Rajeev Rayala |

Updated on: Sep 02, 2021 | 8:07 PM

టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం కలకలం సృష్టిస్తుంది. ఇప్పటికే కొంతమంది లిస్ట్ అవుట్ చేసిన ఈడీ అధికారులు ఒక్కరిని విచారిస్తున్నారు.

Charmy Kaur: ముగిసిన విచారణ.. ఈడీ అధికారులకు పూర్తిగా సహకరిస్తానన్న హీరోయిన్ చార్మి కౌర్

Tollywood Drugs Case: టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం కలకలం సృష్టిస్తుంది. ఇప్పటికే కొంతమంది లిస్ట్ అవుట్ చేసిన ఈడీ అధికారులు ఒక్కరిని విచారిస్తున్నారు. ఇప్పటికే డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ ను విచారించారు అధికారులు. దాదాపు 10 గంటలపాటు పూరి పై ప్రశ్నల వర్షం కురిపించారు అధికారులు. ఇక ఇప్పుడు చార్మి వంతు వచ్చింది.  లిస్ట్‌లో హీరోయిన్ చార్మి పేరు కూడా ఉండటంతో నేడు ఆమె ఈడీ అధికారుల ముందు హాజరైంది. చార్మితో పాటు విచారణకు ఆమె చార్టెడ్ అకౌంటెంట్ సతీష్ కూడా ఈడీ కార్యాలయానికి వెళ్ళింది. మరోవైపు ఈడీ కార్యాలయం ముందు చార్మి బౌన్సర్లు హంగామా ‏చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రైవేట్ బౌన్సర్స్‏ను చార్మి నియమించుకుంది. దాదాపు 15 మంది బౌన్సర్లు ఈడీ కార్యాలయం ఉండడం గమనార్హం.. ఈ రోజు చార్మి బ్యాంక్ అకౌంట్స్‏ను ఈడీ అధికారులు పరిశీలించారు. డ్రగ్స్ సరఫరా చేసే కెల్విన్‌ అనే వ్యక్తి కాంటాక్ట్‌ లిస్ట్‌‌లో చార్మి పేరు ఉండటంతో నోటీసులు జారీ చేసిన ఈడీ అధికారులు ఆమెను విచారించారు. కెల్విన్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌లో చార్మి పేరు దాదాగా సేవ్‌ చేసి ఉన్నట్టు తెలుస్తోంది. దాదా పేరుతో ఉన్న ట్రాన్జాక్షన్స్‌ని గుర్తించారు ఈడీ అధికారులు. కెల్విన్‌ ఇచ్చిన సమాచారంతోనే చార్మిని విచారించారు. ఈడీ అధికారులకు తన రెండు బ్యాంక్‌ అకౌంట్‌ నెంబర్లను ఇచ్చింది చార్మి. అయితే 2013 నుంచి 2018 వరకు మూడేళ్ల పాటు జరిగిన బ్యాంక్‌ లావాదేవీలను ఈడీ అధికారులకు సమర్పించింది చార్మి.

విచారణ అనంతరం మీడియాతో మాట్లాడింది చార్మి. ఈడీ అధికారులు అడిగిన పత్రాలు అన్ని సమర్పించాను. ఈడీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాను. ఈడి విచారణ కు పూర్తి గా సహరించాను. ఇంతకు మించి ఎక్కువ మాట్లాడలేను అంటూ చెప్పుకొచ్చింది. నన్ను అడిగిన బ్యాంక్ డాక్యుమెంట్లు అన్ని ఈడీ అధికారులకు అందజేశాను. ఈడీ అధికారులు ఎప్పుడు విచారణకు హాజరు కావాలని ఆదేశించిన నేను సహకరిస్తున్న. కేసు దర్యాప్తు కొనసాగుతుంది, నేను ఎక్కువ మాట్లాడలేను అని అంది చార్మి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pawan Kalyan Birthday: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు హరిహరవీరమల్లు చిత్రమూనిట్ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ..రిలీజ్ ఎప్పుడంటే

Happy Birthday Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేర్, చైల్డ్‌హుడ్ ఫొటోస్.. మీరు ఓ లుక్ వేయండి..

Jabardasth Varsha: జబర్దస్త్ వర్ష ఇంస్టాగ్రామ్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu