Trivikram Srinivas: ఓ వైపు సూపర్ స్టార్.. మరో వైపు పవర్ స్టార్.. గురూజీ మాస్టర్ ప్లాన్

మొన్నటివరకూ ఎన్టీఆర్ తో జట్టు కట్టి.. అయిననూ పోయిరావలె హస్తినకు అంటూ బెట్టు చేశారు త్రివిక్రమ్. తర్వాత మరేవో కారణాలతో నందమూరి కాంపౌండ్‌కి తాత్కాలికంగా కటీఫ్ చెప్పారు.

Trivikram Srinivas: ఓ వైపు సూపర్ స్టార్.. మరో వైపు పవర్ స్టార్.. గురూజీ మాస్టర్ ప్లాన్
Trivikram
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 12, 2022 | 8:05 PM

మొన్నటివరకూ ఎన్టీఆర్ తో జట్టు కట్టి.. అయిననూ పోయిరావలె హస్తినకు అంటూ బెట్టు చేశారు త్రివిక్రమ్. తర్వాత మరేవో కారణాలతో నందమూరి కాంపౌండ్‌కి తాత్కాలికంగా కటీఫ్ చెప్పారు. అలా బైటపడ్డారో లేదో మరో ఇద్దరు స్టార్‌ హీరోల కాంపౌండ్లతో మింగిలై.. డైరెక్టర్‌గా కంటే న్యూస్‌మేకర్‌గా బిజీ అయ్యారు. దాదాపు ఏడాదిన్నర నుంచి సర్కారువారిపాటతోనే టైమ్‌పాస్ చేస్తున్నారు సూపర్‌స్టార్ మహేష్‌బాబు. నాలుగైదుసార్లు బ్రేకులు పడి మళ్లీ మొదలై ఇప్పుడు ఆఖరు మజిలీలో వుంది ఈ పరశురాముడి భారీ ప్రాజెక్ట్. మొన్నామధ్య హ్యాట్రిక్ సినిమా చేద్దాంరా అని మహేష్ పిలవగానే వచ్చి వాలిన త్రివిక్రమ్.. అప్పటినుంచి సూపర్‌స్టార్ కాల్షీట్స్ కోసం ట్రై చేస్తూనే వున్నారు. నిర్మాత నాగవంశీని వెంటబెట్టుకుని మహేష్‌ దగ్గర మంతనాలు జరుపుతూనే వున్నారు. సర్కారువారి పాట ప్రొడక్షన్ కంపెనీల్లో మైత్రీ సంస్థదే మేజర్ వాటా. త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా కోసం మహేష్‌ని వదిలిపెట్టడం అనేది మైత్రీవారి చేతుల్లోనే వుంది. అక్కడ కట్‌ చేస్తే.. ఇటు పవర్‌స్టార్ కాంపౌండ్‌లో దీనికి పూర్తిగా రివర్స్‌లో నడుస్తోంది స్టోరీ. పవన్‌తో హరీష్‌ శంకర్ డైరెక్షన్‌లో రెండేళ్ల కిందటే సినిమా కన్‌ఫమ్ చేసింది మైత్రీ సంస్థ. గబ్బర్‌సింగ్ కాంబో రిపీట్‌ కోసం ఆడియన్స్‌లో కూడా వెయిటింగ్‌ ఓ రేంజ్‌లో వుంది.

మొదలుపెడదామా సార్ అంటూ హరీష్‌శంకర్ నుంచి పవర్‌స్టార్‌కి చాలాసార్లు పిలుపులొచ్చేశాయి. బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని పవన్‌ కాల్షీట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు భవదీయుడు భగత్‌సింగ్. కాకపోతే.. పవర్‌స్టార్‌ని త్రివిక్రమ్ గట్టిగా పట్టేసుకున్నారు. మధ్యలో స్టార్టయిన భీమ్లానాయక్‌ని చకచకా కంప్లీట్ చేయించారు. ఆ వెంటనే మరో రీమేక్ కోసం పవన్‌తో ట్రయల్స్ వేయిస్తున్నారు త్రివిక్రమ్. ఇన్‌స్టంట్‌గా కొత్తకొత్త ప్రాజెక్టుల్ని ఇంట్రడ్యూస్ చేస్తూ పవన్‌ని ఎప్పటికప్పుడు ఎంగేజ్‌లో పెట్టేస్తున్నారు గురూజీ. ఫైనల్‌గా చిన్న గ్యాప్ తీసుకుని హరిహర వీరమల్లు సెట్లో జాయినయ్యారు పవర్‌స్టార్. మరి.. మన సినిమా సంగతేంటి బాల్ అంటూ హరీష్‌తో కలిసి పవన్‌ దగ్గర పంచాయితీ పెట్టేశారట మైత్రీ నిర్మాతలు. చివరకు పవన్‌ పచ్చజెండా ఊపడంతో అప్‌డేట్స్ మొదలెట్టేస్తున్నాం అని అనౌన్స్ చేసింది మైత్రీ సంస్థ. కానీ.. ఈలోగా మరో రీమేక్ కోసం పవన్‌ని త్రివిక్రమ్‌ లాక్కెళతారన్న డౌట్స్‌ కూడా లేకపోలేదు. ఆవిధంగా పవర్‌స్టార్ కాంపౌండ్‌ని, సూపర్‌స్టార్‌ క్యాంప్‌ని సింగిల్ హ్యాండ్‌తో ఇన్‌ఫ్లుయెన్స్ చేయడంలో సక్సెస్ అవుతున్నారు గురూజీ.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Lata Mangeshkar Award: ప్రధానిని వరించిన తొలి ‘లతా దీనానాథ్‌ మంగేష్కర్‌’ అవార్డు..

Rajamouli: జక్కన్నకు ఘన స్వాగతం పలికిన ఆదివాసీలు.. గాలిబుడగల థియేటర్లో ఆర్ఆర్ఆర్ మూవీ చూసిన రాజమౌళి..

KGF 2 Movie: తన వల్లే మీ ముందు ఇలా ఉన్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన రాకింగ్ స్టార్ యశ్..