KGF 2 Movie: తన వల్లే మీ ముందు ఇలా ఉన్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన రాకింగ్ స్టార్ యశ్..

KGF 2 Movie: తన వల్లే మీ ముందు ఇలా ఉన్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన రాకింగ్ స్టార్ యశ్..
Kgf 2

మోస్ట్ అవైయిటెడ్ చిత్రం కేజీఎఫ్ 2 (KGF 2). కన్నడ రాకింగ్ స్టార్ యశ్  (Yash)ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న

Rajitha Chanti

|

Apr 12, 2022 | 11:02 AM

మోస్ట్ అవైయిటెడ్ చిత్రం కేజీఎఫ్ 2 (KGF 2). కన్నడ రాకింగ్ స్టార్ యశ్  (Yash)ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ముఖ్యంగా ఈ ట్రైలర్‏లో యశ్ చెప్పే డైలాగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. కేజీఎఫ్ వంటి చిత్రంతో సంచలనం క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్.. అదే సినిమాకు సిక్వెల్‏గా కేజీఎఫ్ 2 తీసుకురావడంతో భారీ స్థాయిలో అంచనాలున్నాయి. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం హైదరాబాద్‏లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో హీరో యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. చిత్రయూనిట్ పాల్గోన్నారు. ఈ సందర్భంగా హీరో యశ్ తెలుగు ప్రేక్షకులు తనను ఆదరిస్తానే నమ్మకంతో కేజీఎఫ్ మూవీ రిలీజ్ చేసినట్లు చెప్పుకొచ్చాడు..

కథ నచ్చితే ఏ సినిమానైనా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది.. అదే నమ్మకంతో గతంలో కేజీఎఫ్ 1 చిత్రాన్ని మీ ముందుకు తీసుకువచ్చాం. తెలుగు చిత్ర పరిశ్రమ, ఇక్కడి ప్రేక్షకులు అంటే నాకెంతో ప్రేమ, గౌరవం. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ లేనిదే ఈరోజు మీ ముందు ఇలా ఉండేవాడిని కాదు. అతని ప్రతిభ ఎలాంటిదో మీకు తెలుసు. కన్నడ చిత్రపరిశ్రమ చెప్పుకోదగిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కన్నడ చిత్రపరిశ్రమకు పేరు తీసుకురావాలని ఆలోచనతో నిర్మాత కిరంగదూర్ ఉండేవారు. దర్శకనిర్మాతలు..సాంకేతిక నిపుణులు, నటీనటుల సమిష్టి కృషి వలనే కేజీఎఫ్ మూవీ సాధ్యమైంది. అంటూ చెప్పుకొచ్చారు యశ్. చాప్టర్ 1 తెలుగు వెర్షన్ ను సాయి కొర్రపాటి విడుదల చేశారు. ఆయనకు సహకారం అందించిన రాజమౌళి .. శోభు యార్లగడ్డకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. హనుమాన్ నేరుగా తెలుగు సినిమాకు కష్టపడినట్టే ఈ చిత్రానికి సైతం డబ్బింగ్ చెప్పాడు. ఇక సాహిత్యం విషయానికి వస్తే.. మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అదే విషయాన్ని పాటల రూపంలో అందంగా తెలియజేస్తాడు రామజోగయ్య శాస్త్రి. మాస్, పోయెట్రీ కాంబోలో లిరిక్స్ తో ఈ మూవీని మరో స్థాయికి తీసుకెళ్లారు. చాప్టర్ 1 లాగే.. చాప్టర్ 2 కూడా మిమ్మల్ని అలరిస్తుందని నమ్మకం ఉంది .. దిల్ రాజు గారికి కథ పై పట్టు ఉంటుంది. కేవలం సినిమా గురించి మాత్రమే కాకుండా.. అందుకు సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు.. ఇక హీరోయిన్ శ్రీనిధి సినిమాలో తన పాత్ర తక్కువ ఉంటుందని తెలిసినా ఒప్పుకుంది. ఈ మూవీ కోసం ఆమె కూడా వెయిట్ చేసింది అని తెలిపారు యశ్.

Also Read: Priyamani: ట్రోల్స్ పై స్పందించిన ప్రియమణి.. కొన్నిసార్లు జీర్ణించుకోలేకపోయేదాన్ని అంటూ..

Dasara Movie: గోదావరిఖనిలో దసరా చిత్రయూనిట్ సందడి.. నాని, కీర్తి సురేష్ మధ్య సాంగ్ షూటింగ్..

Vijay Thalapathy: ఆ కారణంతోనే దూరంగా ఉంటున్నా.. సంచలన విషయాలు బయటపెట్టిన విజయ్..

Naga Chaitanya: హీరో నాగచైతన్య కారుకు జరిమానా విధించిన పోలీసులు.. జూబ్లీహిల్స్ చెక్‏పోస్ట్ వద్ద..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu