AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajamouli: జక్కన్నకు ఘన స్వాగతం పలికిన ఆదివాసీలు.. గాలిబుడగల థియేటర్లో ఆర్ఆర్ఆర్ మూవీ చూసిన రాజమౌళి..

కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లాకు చేరుకున్నారు దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli). జిల్లాలోని జన్కాపురంలో పిక్చర్ ట్యూబ్ సంస్థ

Rajamouli: జక్కన్నకు ఘన స్వాగతం పలికిన ఆదివాసీలు.. గాలిబుడగల థియేటర్లో ఆర్ఆర్ఆర్ మూవీ చూసిన రాజమౌళి..
Rajamouli
Rajitha Chanti
|

Updated on: Apr 12, 2022 | 1:24 PM

Share

కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లాకు చేరుకున్నారు దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli). జిల్లాలోని జన్కాపురంలో పిక్చర్ ట్యూబ్ సంస్థ ఏర్పాటు చేసిన గాలిబుడగల థియేటర్‏ను సందర్శిస్తానని చెప్పిన జక్కన్న.. ఈరోజు ఉదయం ఆసిఫాబాద్ జిల్లాకు పయణమయ్యారు. ఆయనకు జిల్లాలోని ఆదివాసీలు.. కొమురంభీం వారసులు ఘన స్వాగతం పలికారు. ఆదివాసీ గుస్సాడీ నృత్యాలతో.. సంప్రదాయబద్దంగా జక్కనకు స్వాగతం పలికారు జిల్లా అడిషనల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి, సమాఖ్య సంగం సభ్యులు. కొమురం భీం ఫోటోకు నివాళులర్పించి.. అనంతరం జిల్లా కేంద్రంలో మహిళా జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్మించిన పిక్చర్ ట్యూబ్ సినిమా థియేటర్‏ను సందర్శించిన రాజమౌళి అందులోనే ప్రేక్షకులతో కలిసి ఆర్ఆర్ఆర్ (RRR) మూవీ వీక్షించారు.

ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించారు జక్కన్న. ఇద్దరూ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్‏తో కలిసి చరిత్రలో ఎప్పుడూ కలవని ఇద్దరూ వీరుల మధ్య స్నేహాన్ని ఎంతో అద్భుతంగా చూపించారు రాజమౌళి. ఇందులో చరణ్ అల్లూరి సీతారామారాజుగా.. తారక్.. గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో నటించి అదరగొట్టారు. మార్చి 25న విడుదలైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి గత రికార్డులను తిరిగరాస్తోంది. ఈ మూవీ విడుదలై రెండు వారాలు పూర్తైన థియేటర్లలో ఆర్ఆర్ఆర్ ప్రభంజనం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కొమురం జిల్లా ఆసిపాబాద్ జిల్లాలోని జన్కాపురంలో పిక్చర్ ట్యూబ్ సంస్థ ఏర్పాటు చేసిన గాలిబుడగల థియేటర్‏ను సందర్శించారు. దీనిని ఢిల్లీకి చెందిన పిక్చర్ టైం అంకుర సంస్థ అధునాత సాంకేతిక బెలూర్ పరిజ్ఞానంతో నిర్మించింది. దాదాపు 120 మంది ప్రేక్షకుల సామర్థ్యం గల దీని నిర్మాణానికి జిల్లా మహిళ సమాఖ్య, సినిమాటోగ్రఫీ విభాగం రూ. 50 లక్షల ఆర్థిక సహయం అందించాయి. ఎంత గాలి వీచిన చెక్కు చెదరకుండా ఉండేలా రూపొందించిన ఈ థియేటర్ లో ఏసీ, సౌండ్ సిస్టమ్‏తో మల్టీప్లెక్స్‏ను తలపించేలా నిర్మించారు. ఈ థియేటర్లో జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ప్రదర్శిస్తున్నారు. అతి తక్కువ వ్యయంతో నిర్మించిన ఈ థియేటర్ గురించి తెలుసుకున్న జక్నన్న ఫోన్ చేసి ఆయనే స్వయంగా థియేటర్ ను చూస్తానని చెప్పారు.

Also Read: Priyamani: ట్రోల్స్ పై స్పందించిన ప్రియమణి.. కొన్నిసార్లు జీర్ణించుకోలేకపోయేదాన్ని అంటూ..

Dasara Movie: గోదావరిఖనిలో దసరా చిత్రయూనిట్ సందడి.. నాని, కీర్తి సురేష్ మధ్య సాంగ్ షూటింగ్..

Vijay Thalapathy: ఆ కారణంతోనే దూరంగా ఉంటున్నా.. సంచలన విషయాలు బయటపెట్టిన విజయ్..

Naga Chaitanya: హీరో నాగచైతన్య కారుకు జరిమానా విధించిన పోలీసులు.. జూబ్లీహిల్స్ చెక్‏పోస్ట్ వద్ద..

తులసి మొక్కకు ఎరుపు దారం కడితే ఇన్ని అద్భుతాలు జరుగుతాయా?
తులసి మొక్కకు ఎరుపు దారం కడితే ఇన్ని అద్భుతాలు జరుగుతాయా?
ఎస్‌బీఐ కస్టమర్లకు షాక్.. ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి కొత్త..
ఎస్‌బీఐ కస్టమర్లకు షాక్.. ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి కొత్త..
5 సినిమాలతో వేసవి వినోదానికి మెగా ఫ్యామిలీ రెడీ
5 సినిమాలతో వేసవి వినోదానికి మెగా ఫ్యామిలీ రెడీ
శివరాత్రి నాడు శివుడికి అపరాజిత పుష్పాలు సమర్పిస్తే ఎన్ని లాభాలో
శివరాత్రి నాడు శివుడికి అపరాజిత పుష్పాలు సమర్పిస్తే ఎన్ని లాభాలో
ఎస్సార్‌ నగర్‌లో కాస్త కంగారుగా కనిపించిన మహిళ.. ఆపి విచారించగా..
ఎస్సార్‌ నగర్‌లో కాస్త కంగారుగా కనిపించిన మహిళ.. ఆపి విచారించగా..
షెకావత్ రోల్‌ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా.?
షెకావత్ రోల్‌ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా.?
టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. తొలి మ్యాచ్ నుంచి బుమ్రా ఔట్?
టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. తొలి మ్యాచ్ నుంచి బుమ్రా ఔట్?
50 మేకలను నోటితో కొరికి బలి.. భీమన్న జాతరలో జంతు బలుల కలకలం
50 మేకలను నోటితో కొరికి బలి.. భీమన్న జాతరలో జంతు బలుల కలకలం
రోజూ వాడే ఉప్పు గురించి ఎవరికీ తెలియని నిజం! అసలు విషయం తెలిస్తే
రోజూ వాడే ఉప్పు గురించి ఎవరికీ తెలియని నిజం! అసలు విషయం తెలిస్తే
అప్పుడు సౌందర్య కూతురిగా.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా..
అప్పుడు సౌందర్య కూతురిగా.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా..