AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LAL SALAAM: లాల్ సలామ్‌ ట్రైలర్ వచ్చేసింది.. అదరగొట్టిన సూప‌ర్ స్టార్ రజినీకాంత్

మొయిద్దీన్ భాయ్ పాత్ర‌లో సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ నటించిన లాల్ సలామ్ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. సుభాస్కరణ్ నిర్మాతగా.. ఐశ్వ‌ర్య ర‌జినీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ లక్ష్మీ మూవీస్ గ్రాండ్‌గా విడుదల చేస్తోంది. బుధవారం సాయంత్రం ఐదు గంటలకు ట్రైలర్‌ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది.

LAL SALAAM: లాల్ సలామ్‌ ట్రైలర్ వచ్చేసింది.. అదరగొట్టిన సూప‌ర్ స్టార్ రజినీకాంత్
Lal Salaam
Praveen Vadla
| Edited By: Rajeev Rayala|

Updated on: Feb 07, 2024 | 8:22 PM

Share

భారతదేశంలో ఎన్నో మ‌తాలు, కులాల వాళ్లు ఇక్క‌డ ఎలాంటి బేదాభిప్రాయాలు లేకుండా ఆనందంగా జీవిస్తున్నారు. కానీ కొంద‌రు స్వార్థ రాజ‌కీయాల‌తో మ‌న‌లో మ‌న‌కు గొడ‌వ‌లు పెట్టారు. దీని వ‌ల్ల న‌ష్టం జ‌రిగింది. అయితే ఇలాంటి చెడు ప‌రిమాణాల నుంచి ప్ర‌జ‌ల‌ను, దేశాల‌ను కాపాడిన వారెందరో ఉన్నారు. అలాంటి ఓ హీరో మొయిద్దీన్ భాయ్‌. మొయిద్దీన్ భాయ్ పాత్ర‌లో సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ నటించిన లాల్ సలామ్ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. సుభాస్కరణ్ నిర్మాతగా.. ఐశ్వ‌ర్య ర‌జినీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ లక్ష్మీ మూవీస్ గ్రాండ్‌గా విడుదల చేస్తోంది. బుధవారం సాయంత్రం ఐదు గంటలకు ట్రైలర్‌ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది.

‘ఊర్లో ఒక్క మగాడు లేడా? ఊర్లో ఉన్నొళ్లందరినీ తీసుకెళ్లి బొక్కలే వేశారు’ అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం అయింది. ఆ తరువాత ఊరి వాతావరణం, క్రికెట్ ఆట, జాతర సీన్లు, రాజకీయంతో ముడిపడ్డ సన్నివేశాలను చూపించారు. ‘మందిని కూడ బెట్టేవాడి కన్నా.. ఎవడి వెనకాల మంది ఉంటారో వాడే చాలా ప్రమాదకరం.. వాడ్ని ప్రాణాలతో వదిల పెట్టకూడదు’ అనే డైలాగ్‌తో రజినీకాంత్ ఎంట్రీ అదిరిపోయింది. ‘బిడ్డ సంపాదిస్తే ఇంటికి గౌరవం.. బిడ్డ సాధిస్తే దేశానికే గౌరవం’, ‘మతాన్ని నమ్మితే మనసులో ఉంచుకో.. మానవత్వాన్ని అందరితో పంచుకో.. ఇండియన్‌గా నేర్చుకోవాల్సింది అదే’ అని తలైవా రజినీకాంత్ చెప్పే డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి.

ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమాలో కథ ఎలా ఉండబోతోందో అర్థం అవుతుంది. ఊరు.. ఊర్లోని రకరకాల మతాలకు చెందిన మనుషులు, రాజకీయ నాయకులు, క్రికెట్, మత ఘర్షణల మధ్య మొయినుద్దీన్ భాయ్ రాక వంటి అంశాలతో పవర్ ఫుల్ ట్రైలర్‌గా నిలిచింది. త‌మిళ‌, తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రాబోతోనన ఈ చిత్రాన్ని ఐశ్వ‌ర్య ర‌జినీకాంత్ డైరెక్ట్ చేశారు. ర‌జినీకాంత్ కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రంలో విష్ణు విశాల్‌, విక్రాంత్‌, జీవితా రాజశేఖర్, క్రికెట్ లెంజెండ్ క‌పిల్ దేవ్ త‌దిత‌రులు న‌టించారు. రీసెంట్‌గా జైల‌ర్‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన తలైవ‌ర్ ఇప్పుడు ‘లాల్ సలాం’తో రానుండటంతో ఆయ‌న అభిమానుల‌తో పాటు సినీ ప్రేక్ష‌కుల్లోనూ అంచ‌నాలు పీక్స్‌కు చేరుకున్నాయి.