TOP9 ET: దిమ్మతిరిగే న్యూస్.! పుష్ప పార్ట్3 కూడా వస్తుందోచ్.. | ముద్దు తెచ్చిన తంటా.! చిక్కుల్లో హృతిక్, దీపిక.
శోభ ధూళిపాల తెలుగు హీరోయిన్. బాలీవుడ్ లో దూసుకుపోతున్న హీరోయిన్. అలాంటి ఈ హీరోయిన్ తాజాగా హాలీవుడ్‌లో బంపర్ ఆఫర్ పట్టారు. యాక్టర్ అండ్ డైరెక్టర్ దేవ్ పటేల్ తెరకెక్కిస్తున్న మంకీ మ్యాన్ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. యాక్ట్ చేయడమే కాదు.. తన రోల్... ఎవరి ఊహకు అందనట్టుగా ఉంటుందంటూ.. తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశారు. ఆ కామెంట్స్‌తోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.
01.Pushpa
ఇప్పటి వరకు పుష్ప టూ పార్ట్స్ అనే.. మనందరం అనుకున్నాం..! కానీ థర్డ్ పార్ట్ కూడా ఉంటుందనే న్యూస్ ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ ను ఎగిరిగంతేసేల చేస్తోంది. పుష్ప ది రైస్.. పుష్ప ది రూల్! ఈ రెండు సినిమాలే కాక.. మూడో సినిమాగా.. పుష్ప ది రోర్ కూడా ఉందంటూ.. ఓ స్ట్రాంగ్ బజ్ అటు ఇండస్ట్రీలోనూ.. ఇటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. ఇదే కనుక నిజం అయితే.. ఇదో ట్రెండ్ సెట్టింగ్ గా కూడా మారనుంది.
02.fighter: ముద్దు తెచ్చిన తంటా.. చిక్కుల్లో హృతిక్, దీపిక.
ఫైటర్ సినిమాలోని లిప్ కిస్ ఇప్పుడు పెద్ద ఇష్యూగా మారింది. సినిమాలో.. ఓ సీన్లో భాగంగా.. ఎయిర్ ఫోర్స్ యూనిఫాంలో.. హృతిక్, దీపిక కిస్ పెట్టుకోవడమనేది… ఓ IAF అధికారికి కోపం తెప్పించింది. ఇది ఇండిమన్ ఎయిర్ ఫోర్స్ ప్రతిష్ఠను దిగజార్చడమనే ఆయనకు అనిపించింది. దీంతో ఈ మూవీ మేకర్స్‌కు తాజాగా లీగల్ నోటీసులు పంపిచారు ఆ IAF అధికారి
03. OG: పవన్ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే న్యూస్ OG రాక డిసైడైంది..
పవన్ ఫ్యాన్స్…! ఓజీ రాక కోసం వెయిట్ చేస్తున్న మీ అందరికీ గుడ్ న్యూస్. ఓజీ వచ్చేస్తున్నాడు. సెప్టెంబర్ 27న థియేటర్లో దిగడం పక్కా అంటున్నాడు. తాజాగా ఓజీ ప్రొడక్షన్ కంపెనీ డీవీవీ తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఓ అనౌన్స్ మెంట్ చేసింది. ఓజీ మూవీని సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నట్టు చెప్పేసింది. ఓ నయా ఓజీ పోస్టర్‌ను కూడా.. నెట్టింట వదిలింది. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది.
04. Siddu jack: ఇదేంది..! రాధికా అనేటోడిని.. గింత దారుణంగా మార్చిండ్రు.
డీజె టిల్లు సినిమాతో.. ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయిన సిద్దు జొన్నల గడ్డ.. ఇప్పుడు యాక్షన్ మోడ్లోకి మారిపోయాడు. బొమ్మరిల్లు ఫేం భాస్కర్ డైరెక్షన్లో.. జాక్ అనే సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో స్పైథిల్లర్‌గా తెరకెక్కుతోంది. టిల్లు బర్త్‌డే కావడంతో.. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ అయింది. అది కాస్తా.. ఇప్పుడు అందర్నీ షాక్ అయ్యేలా చేస్తూనే ట్రెండ్ అవుతోంది.
05. Eagle: ఈయన రూటే సపరేట్‌గా…
రవితేజ, అనుపమ పరమేశ్వరన్, కావ్య థపర్ లీడ్‌లో.. కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కించిన సినిమా ఈగల్. ఫిబ్రవరి 9న గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. దీంతో ఈ మూవీ టికెట్ రేట్స్‌పై ఈమూవీ మేకర్స్… ఓ మంచి డెసీషన్ తీసుకున్నట్టు ఇన్‌సైడ్ టాక్. టికెట్ రేట్ 295 రూపాయలు కాకుండా.. 200 రూపాయలతో నార్మల్‌గా వెళ్లాలని.. ఈగిల్ మేకర్స్ థింక్ చేస్తున్నారట.
06.Yathra 2: యాత్ర సినిమాను.. జగనన్న జైత్ర యాత్రను ఎవరూ ఆపలేరు.
యాత్ర2 టికెట్స్ అమ్ముపోవడం లేదని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్‌పై సోషల్ మీడియాలోనే రియాక్టవుతున్నారు YSRCP ఫాలోవర్స్. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరని.. టీడీపీ ప్రచారాలతో.. రాజన్న, జగనన్న స్థాయిని తగ్గించలేరని.. USAలో 10 వేల టికెట్లు అమ్ముడయ్యాయని.. 2 రోజుల ఆగితే ఈ సినిమా స్థాయి ఏంటో మీకే తెలుస్తుందని.. యాత్ర సినిమాను కానీ .. జగనన్న జైత్ర యాత్రను కానీ ఎవరూ ఆపలేరని.. సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక జీవ, జగనన్న రోల్‌లో యాక్ట్ చేసిన యాత్ర 2 సినిమా ఫిబ్రవరి 8నే గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
07.Monkey Man: హాలీవుడ్లో బంపర్ ఆఫర్ కొట్టేసిన తెలుగు హీరోయిన్.
శోభ ధూళిపాల తెలుగు హీరోయిన్. బాలీవుడ్ లో దూసుకుపోతున్న హీరోయిన్. అలాంటి ఈ హీరోయిన్ తాజాగా హాలీవుడ్‌లో బంపర్ ఆఫర్ పట్టారు. యాక్టర్ అండ్ డైరెక్టర్ దేవ్ పటేల్ తెరకెక్కిస్తున్న మంకీ మ్యాన్ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. యాక్ట్ చేయడమే కాదు.. తన రోల్… ఎవరి ఊహకు అందనట్టుగా ఉంటుందంటూ.. తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశారు. ఆ కామెంట్స్‌తోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.
08.Esha Deol : అవును విడిపోయాం!
బాలీవుడ్ హీరోయిన్..! లెజెండరీ హీరో ధర్మేంద్ర డాటర్ ఈషా డియోల్ డైవోర్స్ తీసుకున్నారు. 12 ఏళ్ల వివాహ బంధం నుంచి విడిపోతున్నట్టుగా మొహమాటం లేకుండా తాజాగా ఆమె మీడియాకు చెప్పారు. ఇక చాలా కాలంగా వీరి విడాకులకు సంబంధించిన వార్తలు బీ టౌన్‌లో వినిపిస్తున్నాయి. ఇప్పుడవే నిజమైపోయాయి.
09. Vijay: తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే.!
విజయ్ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నారు. గతేడాది వారసుడు, లియోతో వచ్చిన విజయ్.. 2024లోనూ రెండు సినిమాలతో రావాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న GOAT సమ్మర్ తర్వాత విడుదల కానుంది. ఇక డివివి ఎంటర్‌టైన్మెంట్స్‌లో విజయ్ కమిట్ అయిన సినిమాను వెట్రి మారన్ తెరకెక్కించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

