AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండస్ట్రీలో ఆ హీరోకి ఉన్న డేరింగ్ ఎవ్వరికీలేదు.. ఆయన టాలీవుడ్‌లో తోపు నటుడు

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కరడు గట్టిన విలన్ పాత్రల్లో ఒదిగిపోయి నటులు చాలా మందే ఉన్నారు. అందులో సత్య ప్రకాశ్ ఒకరు. తన భయంకరమైన విలనిజంతో ‘సైకో సత్య’గా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారాయన. రూపు చూస్తే సత్య ప్రకాశ్ ఉత్తరాది వారేమో అనుకుంటారు చాలా మంది. కానీ ఆయన మన తెలుగు వాడే.

ఇండస్ట్రీలో ఆ హీరోకి ఉన్న డేరింగ్ ఎవ్వరికీలేదు.. ఆయన టాలీవుడ్‌లో తోపు నటుడు
Satya Prakash
Rajeev Rayala
|

Updated on: Jun 28, 2026 | 4:47 PM

Share

ప్రముఖ టాలీవుడ్ నటుడు సత్య ప్రకాష్ ఒకప్పుడు విలన్‌గా ఎన్నో సినిమాలు చేసి మెప్పించాడు. విలనిజంలో తనదైన శైలిలో నటనను పండించి ప్రేక్షకులను భయపెట్టాడు సత్యప్రకాష్. ప్రస్తుతం ఆయన సినిమాల స్పీడ్ తగ్గించారు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో సత్యప్రకాష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలోని కీలక అనుభవాలను, ముఖ్యంగా నందమూరి బాలకృష్ణతో తన అనుబంధాన్ని ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తన విలక్షణమైన విలన్ పాత్రలకు ప్రేక్షకుల నుంచి ఎదురైన విచిత్రమైన, కొన్నిసార్లు భయంకరమైన స్పందనలను ఆయన గుర్తుచేసుకున్నారు. సత్య ప్రకాష్ ఒకానొక సందర్భంలో తన విలనిజం ఎంతగా ప్రేక్షకులపై ప్రభావం చూపిందో తెలిపారు. సమరసింహారెడ్డి సినిమా షూటింగ్ సమయంలో వైజాగ్‌లోని జగదాంబ జంక్షన్ వద్ద తాను కూర్చుని ఉండగా, వెనుక నుంచి కొందరు మహిళలు “వీడే ఆ దరిద్ర నా కొడుకు. రేపులు చేసాడే, వీడే. వీడు కానీ నిజంగా దొరికితే చంపేయాలి” అని మాట్లాడుకోవడం విన్నానని తాను వెనక్కి తిరిగి చూడగానే ఆ మహిళలు మాయమైపోయారని తెలిపారు సత్య ప్రకాష్.

ఇది కూడా చదవండి : ఇది కదా సినిమా అంటే..! రూ.32 కోట్లు పెడితే ఏకంగా రూ.456కోట్లు వసూల్ చేసింది.. ఓటీటీలోనూ తోపే

ఇప్పటికాలంలో కాలంలో యూట్యూబ్, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా నటన పట్ల అవగాహన పెరిగిందని, కానీ అప్పట్లో అది లేదని ఆయన పేర్కొన్నారు. అలాగే నందమూరి బాలకృష్ణతో తన అనుబంధం గురించి మాట్లాడుతూ, ఆయనతో పదికి పైగా సినిమాలలో నటించానని సత్య ప్రకాష్ తెలిపారు. బాలకృష్ణను “వన్ ఆఫ్ ది మోస్ట్ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో” అని ఆయన అన్నారు. “సమరసింహారెడ్డి” చిత్రం షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను గుర్తుచేసుకున్నారు. పది అడుగుల ఎత్తు నుంచి కార్ల మీదకు దూకే సన్నివేశంలో తాను భయపడి “నా వల్ల కుదరదు” అని చెప్పగా, బాలకృష్ణ ఏ మాత్రం ఆలోచించకుండా దూకేశారని సత్య ప్రకాష్ వివరించారు. “ఒక డేరింగ్ నెస్‌కి, ఒక డాషింగ్ నెస్‌కి ఇంకో పేరు పెట్టాలి అంటే బాలయ్య బాబే” అని ఆయన ప్రశంసించారు.

ఇది కూడా చదవండి : ఏం లిరిక్స్ భయ్యా..! కుర్రాళ్లు కన్నీళ్లు పెట్టేలా చేసిన సాంగ్.. చాలా మంది ఫేవరెట్ పాట

ఇంకో సంఘటనగా “విజయేంద్ర వర్మ” చిత్రం కోసం ఉదయ్‌పూర్‌లో జరిగిన షూటింగ్‌ను సత్య ప్రకాష్ గుర్తుచేసుకున్నారు. ఒక ఎత్తైన భవనం నుంచి కిందకు దూకే సన్నివేశంలో తాను చేయలేనని చెప్పగా, బాలకృష్ణ తన ముందు దూకి చేయమని ప్రోత్సహించారని ఆయన అన్నారు. బాలకృష్ణ దూకినప్పుడు రెండు బాక్సుల మధ్య కాలు పడి యాంకిల్ విరిగి, షూ విప్పగానే ఫౌంటెన్ లాగా రక్తం వచ్చిందని సత్య ప్రకాష్ తెలిపారు. అక్కడున్న మిలటరీ కర్నల్‌తో పాటు తెలుగువారు అందరూ చూస్తుండగా జరిగిన ఈ సంఘటనలో బాలకృష్ణకు కళ్లు తిరిగినా, ఏమాత్రం పట్టించుకోకుండా ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నారని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. “అంత స్ట్రాంగ్ విల్ పవర్ ఉండడం అనేది చాలా రేర్ ఫెనోమెనన్. నాకున్న ఇన్నేళ్ల కెరీర్‌లో బాలయ్య బాబు ఒక్కరే” అని సత్య ప్రకాష్ అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఒక్క సినిమా కూడా చేయలేదు.. కానీ స్టార్ హీరోయిన్స్‌కు మించి క్రేజ్.. కుర్రాళ్లు పడిచచ్చిపోతారు

Balakrishna

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us