సినీ పరిశ్రమలో ఎపుడు బిజీగా గడిపే ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్‌లు కాస్తంత ఖాళీదొరికితే చాలు తమ సొంత గ్రామంలో వాలిపోతుంటారు . గ్రామంలో అనేక సేవ కార్యక్రమాలు చేపడుతుంటారు. ఈ క్రమంలోనే మరోసారి సినీ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. బాపట్ల జిల్లా చీరాల ప్రాంతంలోని కోటయ్య వృద్ధాశ్రమాన్ని ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణులు ఖాళీదొరికినప్పుడల్లా సందర్శిస్తుంటారు .అంతేకాకుండా తమకు సాధ్యమేనంత వరకు వ్యక్తిగత సహాయాన్ని అందిస్తుంటున్నారు . అయితే ఆసారి కాస్తంత వినూత్నంగా ఆలోచించారు. ఆ ఆశ్రమానికి తమ వ్యక్తిగత సహాయంతో పాటుగా సమాజంలోని ప్రతి ఒక్కరిని భాగస్వామ్యులను చేయాలనుకున్నారు .ఈ క్రమంలోనే ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్‌లు స్వయంగా చీరాల పట్టణంలోని పలు ప్రాంతాలలో జోలి బట్టి బిక్షాటన చేశారు . స్వయంగా ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణులే సహాయాన్ని కోరడంతో పట్టణంలోని దుకాణాలు, ఆర్టీసీ బస్సులలో ప్రయాణికులు ,రహదారుల పై వెళుతున్న ప్రజలు బిక్షాటం చేసేందుకు ముందుకు వచ్చారు. బిక్షాటన ద్వారా సేకరించిన నగదుతో పాటుగా ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణులు కొంత నగదు అందించి వాహనం కొనుగోలు నిమిత్తం ఆశ్రమ నిర్వాహకులకు నగదును అందజేశారు.
ఈసందర్భంగా ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణులు మాట్లాడుతూ సామజిక సేవా కార్యక్రమలలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకే తాము బిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు .”మానవసేవే మాధవసేవ” అనే సూక్తిని ప్రతి ఒక్కరు పాటించాలన్నారు .అపుడే సమాజం బాగుంటుందన్నారు .అనంతరం కోటయ్య వృద్దాశ్రమాన్ని రామ్ లక్ష్మణ్‌లు సందర్శించారు.ఆశ్రమంలోని వృద్ధులతో కొద్దిసేపు ముచ్చటించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. నిస్వార్థ సేవతో ఎంతోమంది వృద్ధులకు ఆశ్రయం కల్పించిన నిర్వహకురాలు స్వర్గీయ కోటయ్య సతీమణి ప్రకాశమ్మను ఫైట్ మాస్టర్లు అభినందించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..