ఈ దసరాకి టాలీవుడ్‌లో బిగ్ ఫైట్ జరగనుంది. చాలా కాలం తరువాత ఇద్దరు టాప్ స్టార్స్ ఒకే రోజు థియేటర్లలోకి వస్తున్నారు. అయితే ఈ క్లాష్ సౌత్‌కి మాత్రమే పరిమితం కాలేదు. తమ సినిమాలతో నార్త్‌లోనూ పోటి పడేందుకు సై అంటున్నారు ఈ సీనియర్ హీరోలు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన రీమేక్ మూవీ గాడ్ ఫాదర్. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 5న రిలీజ్ కానుంది. ఆల్రెడీ ప్రమోషన్ షురూ చేసిన మెగాస్టార్ జెట్ స్పీడుతో దూసుకుపోతున్నారు. ముందు రీజినల్ ప్రాజెక్ట్‌గానే స్టార్ చేసిన ఈ సినిమాను ఇప్పుడు హిందీలోనూ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది మూవీ టీమ్.
గాడ్ ఫాదర్ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించారు. ఆల్రెడీ చిరు, సల్మాన్ కాంబినేషన్‌లో తెరకెక్కించిన సాంగ్… సౌత్ నార్త్ ఇండస్ట్రీల్లో సినిమా మీద అంచనాలు పెంచేసింది. దీంతో గాడ్ ఫాదర్ నార్త్ రిలీజ్ కూడా గట్టిగానే సౌండ్ చేస్తోంది.
గాడ్ ఫాదర్‌తో పోటికి రెడీ అవుతున్న నాగ్ కూడా ఇదే బాటలో నడుస్తున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది ఘోస్ట్ సినిమా చేశారు కింగ్. ఈ సినిమా కూడా దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్ విషయంలో చిరు కన్నా ఒక అడుగు ముందే ఉన్నారు నాగ్.
భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను కూడా హిందీలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు నాగ్. రీసెంట్‌గా బ్రహ్మాస్త్ర సినిమాతో నార్త్ ఆడియన్స్‌తో రికనెక్ట్ అయ్యారు నాగ్. అందుకే ది ఘోస్ట్‌ను నార్త్ లో రిలీజ్ చేస్తే ప్లస్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే సౌత్ యంగ్ హీరోస్ నార్త్ మార్కెట్‌ను షేక్ చేస్తున్నారు.. ఇప్పుడు సీనియర్స్ కూడా ఇదే బాటలో నడుస్తుండటంతో బాలీవుడ్ సర్కిల్స్‌లో టెన్షన్ మరింత ఎక్కువైంది.