AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Hema: హేమ ఇంట్లో తీవ్ర విషాదం.. కన్నీరుమున్నీరవుతోన్న సీనియర్ నటి

టాలీవుడ్ సీనియర్ నటీమణి హేమ ప్రస్తుత సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. అప్పుడప్పుడు మాత్రమే ఏదైనా సినిమా ఈవెంట్లలో కనిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ తక్కువగానే ఉంటుంది. అయితే తాజాగా ఈ సీనియర్ నటిమణి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దీంతో ఆమె కన్నీరుమున్నీరవుతోంది.

Actress Hema: హేమ ఇంట్లో తీవ్ర విషాదం.. కన్నీరుమున్నీరవుతోన్న సీనియర్ నటి
Actress Hema
Basha Shek
|

Updated on: Nov 18, 2025 | 6:02 PM

Share

టాలీవుడ్ సీనియర్ నటి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె కన్నతల్లి కోళ్ల లక్ష్మి (80) కన్నుమూశారు. వయసు సంబంధిత సమస్యలతో పాటు కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతోన్న ఆమె సోమవారం (నవంబర్ 17) రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న హేమ కన్నీరుమున్నీరైపోయింది. వెంటనే హైదరాబాద్ నుంచి తన స్వగ్రామం రాజోలుకు వచ్చింది.  తల్లి పార్థీవ దేహాన్ని చూసి బోరున విలపించింది. నిన్న ఉదయం తనతో బాగానే మాట్లాడిందని, ఇంతలోనే ఇలా ఘోరం జరిగిపోయిందని చెబుతూ వెక్కి వెక్కి ఏడ్చేసింది.  దీంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు హేమను ఓదార్చారు.  అనంతరం సోంపల్లి కైలాస భూమిలో జరిగిన లక్ష్మి అంత్యక్రియల్లో హేమతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. హేమకు కోళ్ల శ్రీనివాస్ అనే ఒక సోదరుడు ఉన్నాడు.

తెలుగులో  వందలాది సినిమాల్లో సహాయక నటిగా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది హేమ. హీరోలు, హీరోయిన్లకు తల్లిగా, పిన్నిగా, అక్కగా, వదినగా ఇలా అన్ని పాత్రల్లోనూ నటించి మెప్పించింది. చాలా సినిమాల్లో తన కామెడీతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించింది.  సినిమాలతో పాటు ప్రముఖ తెలుగు రియాలిటీ బిగ్ బాస్ షోలోనూ సందడి చేసిందీ సీనియర్ నటీమణి. పలు టీవీ షోల్లోనూ సందడి చేసింది. అయితే  గతేడాది ఓ రేవ్ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకుందనే ఆరోపణలు వచ్చాయి.  దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. కొన్ని రోజులు బెంగళూరు జైలులో ఉన్న ఆమె బెయిల్ పై బయటకు వచ్చింది. తాను డ్రగ్స్ తీసుకోలేదని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది హేమ. అదే సమయంలో తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలు,  జైలుకెళ్లడం చూసి తల్లి తట్టుకోలేకపోయిందని, అనారోగ్యానికి గురైందని పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది. ఇప్పుడు లక్ష్మీ ఆరోగ్యం మరింత క్షీణించడంతో  తుదిశ్వాస విడిచింది.

Actress Hema Mother

Actress Hema Mother

సినిమా ఇండస్ట్రీకి దూరంగా..

కాగా హేమ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది. ఆ మధ్యన తనపై వచ్చిన ఆరోపణలతో మనస్థాపానికి గురైన ఆమె ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. అలాగే సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటోంది .

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్

ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..

ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్

ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే

జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'

కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌

భర్త ఫోటో రివీల్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి..

700 ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న దీపం.. కాకతీయుల నాటి ఈ గుడి ప్రత్యేకత

రన్నింగ్‌ ట్రైన్‌లో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందా? టెన్షనొద్దు!

చల్లచల్లగా ముల్లంగి మజ్జిగ పులుసు.. వేసవికి పర్ఫెక్ట్ రెసిపీ
చల్లచల్లగా ముల్లంగి మజ్జిగ పులుసు.. వేసవికి పర్ఫెక్ట్ రెసిపీ
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్
ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..
ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..
ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్
ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్
ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే
ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే
జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'
జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో

మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు

అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ

మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం