Tollywood : టాలీవుడ్‌కు భారీ షాక్.. షూటింగ్స్‌ బంద్‌.? ఎందుకంటే

టాలీవుడ్(Tollywood )కు భారీ షాక్ తగలనుంది. షూటింగ్ లను నిలిపివేయాలని  నిర్మాతలు భావిస్తున్నారు. ఆగస్టు 1నుంచి సినిమా షూటింగ్‌లు నిలిపివేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.

Tollywood : టాలీవుడ్‌కు భారీ షాక్.. షూటింగ్స్‌ బంద్‌.? ఎందుకంటే
Tollywood
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 17, 2022 | 7:56 PM

టాలీవుడ్(Tollywood )కు భారీ షాక్ తగలనుంది. షూటింగ్ లను నిలిపివేయాలని  నిర్మాతలు భావిస్తున్నారు. ఆగస్టు 1నుంచి సినిమా షూటింగ్‌లు నిలిపివేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఓటీటీ తీరు , నిర్మాణ వ్యయం నియంత్రించే ఫార్ములా కోసం గత కొద్దీ రోజులుగా నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు. నిర్మాణ వ్యయం తగ్గకపోతే నిర్మాతకి మనుగడ లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రొడ్యూసర్లు. అవసరమైతే కొన్నాళ్లు షూటింగ్‌లు బంద్‌ చేద్దామని నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. కరోనా పుణ్యమా అని ఓటీటీలకు భారీ డిమాండ్ పెరిగింది. ఓటీటీలకు అలవాటు పడిన ప్రేక్షకులు.. థియేటర్స్ కు రావడం మానేశారని నిర్మాతలు ఎప్పటినుంచో ఆవేదన వ్యక్తం చేస్తున్నరు. నిజంగానే కోవిడ్ తర్వాత థియేటర్స్ కు ఆడియన్స్ రావడం తగ్గించారు. దాంతో టాలీవుడ్ భారీ నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. చర్చల అనంతరం పది వారాల తర్వాతే ఓటీటీల్లో సినిమాల విడుదల చేయాలనే ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఈ వ్యవహారం పై రెండు మూడు రోజుల్లో తెలుగు చిత్ర పరిశ్రమ సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

కోవిడ్‌ తర్వాత సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ.. థియేటర్‌కి వచ్చే ప్రేక్షకుల సంఖ్య భారీగా తగ్గింది. కానీ ఖర్చులు మాత్రం గతం కంటే రెట్టింపయ్యాయి. పైగా ఓటీటీల ప్రభావం సినిమా రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. వీటన్నిటిపైనా చర్చించి.. రెండు మూడు రోజుల్లో తెలుగు చిత్ర పరిశ్రమ సంచలన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.షూటింగ్స్‌ బంద్ చేసి.. నిర్మాణ వ్యయం నియంత్రించే ఫార్ములా కోసం సమాలోచనలు చేయనున్నారు నిర్మాతలు. నిర్మాణ వ్యయం తగ్గకపోతే మనుగడ లేదనే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి