Shalini Pandey: బ్లాక్ అండ్ వైట్ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న షాలిని పాండే
విజయ్ దేవరకొండను ఓవర్ నైట్ లో స్టార్ ను చేసిన సినిమా అర్జున్ రెడ్డి.. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా షాలిని పాండే నటించింది.
విజయ్ దేవరకొండను ఓవర్ నైట్ లో స్టార్ ను చేసిన సినిమా అర్జున్ రెడ్డి.. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా షాలిని పాండే(Shalini Pandey)నటించింది. తొలి సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ కుర్రాళ్ళ గుండెలను కొల్లగొట్టింది. చబ్బీ చీక్స్ తో ఆకట్టుకున్న ఈ భామ ఆతర్వాత చాలా రోజులు వెండితెరపై కనిపించాదు. అర్జున్ రెడ్డి సినిమాలో బాబ్లీ లుక్ లో కనిపించిన షాలిని ఆ తర్వాత సన్నజాజిలా మారిపోయింది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు తుఫాన్ సృష్టిస్తోంది, హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇక అనుష్క ప్రధాన పాత్రలో నటించిన నిశ్శబ్దం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి అలరించింది షాలిని. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఈ అమ్మడికి అవకాశాలు తగ్గాయి. ఆతర్వాత కళ్యాణ్ రామ్ నటించిన 118 సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది.
ఇక తర్వాత తమిళ్ ఇండస్ట్రీకి చెక్కేసింది. అక్కడ అదృష్టం పరీక్షించుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఆతర్వాత తిరిగి తెలుగు ఇండస్ట్రీలో రాజ్ తరుణ్ తో కలిసి ఓ సినిమా చేసింది షాలిని. ఇద్దరి లోఖం ఒక్కటే అనే సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేక పోయింది. దాంతో ఇప్పుడు ఈ అమ్మడికి అవకాశాలు తగ్గాయని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తోంది. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేసి కుర్రాళ్లకు నిద్రపట్టనివ్వడం లేదు షాలిని. రీసెంట్ గా బ్లాక్ అండ్ వైట్ లో బోల్డ్ ఫొటోస్ షేర్ చేసింది షాలిని. వయ్యారాలు ఒలకబోస్తూ.. ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ బ్యూటీ. ఈ ఫోటోలకు కుర్రాళ్ళు కొంటె కామెంట్స్ తో వైరల్ చేస్తున్నారు.
View this post on Instagram