Tollywood News: మరోసారి వాయిదా పడిన టాలీవుడ్ కీలక సమావేశం.. ఎందుకంటే..
రేపు జరగవలసిన టాలీవుడ్ (Tollywood) కీలక సమావేశం మరోసారి వాయిదా పడింది. మంగళవారం జరగాల్సిన తెలుగు చిత్రపరిశ్రమ కీలక సమావేశానికి పలువురు
రేపు జరగవలసిన టాలీవుడ్ (Tollywood) కీలక సమావేశం మరోసారి వాయిదా పడింది. మంగళవారం జరగాల్సిన తెలుగు చిత్రపరిశ్రమ కీలక సమావేశానికి పలువురు ప్రముఖులు సుముఖత చూపకపోవడంతో వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi).. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. వీరిద్దరి సమావేశం అనంతరం టాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న మొదటి సమావేశం ఇది. దీంతో ఈ మీటింగ్ కు ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగాల్సి ఉంది. ఇందులో చిత్ర పరిశ్రమలోని అన్ని సంఘాల ప్రతినిధులు పాల్గొంటారు. అయితే పలువురు ప్రముఖుల నుండి సానుకూల స్పందన రాకపోవడంతో ఈ సమావేశాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో సినిమా టికెట్స్ రేట్స్ తగ్గించడంపై ఇప్పటికే సినీ ప్రముఖులు.. సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నాని మధ్య మాటల యుద్ధం సాగింది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సైతం మంత్రి పేర్ని నానితో సమావేశయ్యారు. ఇక వాదనలు.. ప్రతివాదనల తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఒంటరిగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో సమావేశమై.. సినిమాకు సంబంధించిన పరిస్థితులు, ఇబ్బందులు వంటి అంశాలపై చర్చించారు. వీరి మీటింగ్ అనంతరం చిరు మాట్లాడుతూ.. జగన్ చాలా సానుకూలంగా స్పందించారని.. సినీ పరిశ్రమ మేలు కోసమే సీఎంతో భేటీ అయ్యానని చెప్పారు. తెలుగు చిత్రపరిశ్రమకు జగన్ మేలు చేస్తారనే నమ్మకం ఉందని తెలిపారు. అయితే ఈ సమావేశంతో టాలీవుడ్ సినీ పెద్ధలు అందరు ఒకే వేదికపైకి వచ్చే అవకాశం ఉందని అంతా అనుకున్నారు. మంగళవారం జరగాల్సిన ఈ సమావేశంలో చిరు.. జగన్తో చర్చించిన అంశాల గురించి సినీ ప్రముఖులకు తెలిపే అవకాశం ఉందని టాక్ వినిపించింది. సినిమా టికేట్స్ రేట్స్, పరిశ్రమలోని ఇబ్బందులే ఏజెండాగా ఈ సమావేశం జరగనున్నట్లుగా తెలుస్తోంది.
Also Read: Lata Mangeshkar: రాజ్‌కపూర్‌పై అలిగిన లతా మంగేష్కర్.. ఎందుకు అలా చేసిందంటే..
Shruti Haasan: పచ్చని ప్రకృతి నడుమ ఫోటోలకు ఫోజులిచ్చిన ‘శ్రుతి హాసన్’ సొగసులు చూడతరమా..(ఫొటోస్)