Drugs Case: సినీ తారాల డ్రగ్స్ కేసులో ముగిసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ.. విస్తుగొలిపే సంగతులు.!

సినీ తారాల డ్రగ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ ముగిసింది. సినిమా డైరెక్టర్ పూరి జగన్నాధ్ మెుదలుకొని హీరో తరుణ్ వరకు 12 మంది సినీ ప్రముఖులను

Drugs Case: సినీ తారాల డ్రగ్స్ కేసులో ముగిసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ.. విస్తుగొలిపే సంగతులు.!
Drugs Case
Follow us

|

Updated on: Sep 23, 2021 | 1:24 PM

Tollywood Drugs Case: సినీ తారాల డ్రగ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ ముగిసింది. సినిమా డైరెక్టర్ పూరి జగన్నాధ్ మెుదలుకొని హీరో తరుణ్ వరకు 12 మంది సినీ ప్రముఖులను ఈడీ సుదీర్ఘంగా విచారించింది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ కేసు ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ.. మనీ ల్యాండరింగ్ ఆరోపణలపై సినీ తారలపై ప్రశ్నల వర్షం కురిపించింది.. డ్రగ్స్ కేసులో కెల్విన్ సహా ఇతర నిందితులతో ఉన్న సంబంధాలపై ఈడీ ఆరా తీసింది.. కానీ.. ఇదే కేసులో చార్జ్ షీట్ దాఖలు చేసిన ఎక్సైజ్ శాఖ సినీ తారలందరికి క్లీన్ చిట్ ఇచ్చింది. శరవేగంగా ధర్యాప్తు పూర్తి చేసిన ఈడీ ఎక్సైజ్ శాఖ చార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకుంటుందా లేదా.. అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఈడీ విచారణ సినీ తారలకే పరిమతమవుతుందా. రాజకీయ రంగు పూసుకుంటుందా అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.

టాలివుడ్ డ్రగ్స్ కేసులో నటుడు తరుణ్ ఈడీ విచారణకు హజరయ్యారు. ఉదయం 10 గంటలకు ఈడీ కార్యాలయానికి తనతో పాటు చాటెడ్ అకౌంటెడ్ తో హజరయ్యిన తరుణ్ ను ఈడీ దాదాపు ఎనిమిది గంటల పాటు సుధీర్ఘంగా విచారించింది. మనీ ల్యాండరింగ్ వ్యవహారంలో తరుణ్ ను ఈడీ ప్రశ్నించింది. డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు కెల్విన్ తో పరిచయాలు, అనుమానిత లావాదేవీలపై ఈడీ కూపీ లాగింది. తరుణ్ విచారణ కోనసాగుతండగా అతని తండ్రి మరికొన్ని డాక్యూమెంట్లు తీసుకుని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. గతంలో ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ విచారణకు హాజరైన తరుణ్ ను 13 గంటల పాటు విచారించింది. 2017 జులై 19 న స్వచ్చందంగా బయో షాంపుల్స్ ఇచ్చిన తరుణ్ కు ఎఫ్ఎస్ఎల్ నివేదికలో తరుణ్ డ్రగ్స్ ఆనవాళ్లు లేవని క్లీన్ చిట్ ఇచ్చింది.. మరోవైపు ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ శాఖ రంగారెడ్డి కోర్టులో ధాఖలు చేసిన చార్జ్ షీట్ లో సినీ తారలకు క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో ఈకేసులో ఇప్పుడు తరుణ్ విచారణ లో ఈడీ ఎలా వ్యవహరిస్తుందనేది ఆసక్తిగా మారింది.

ఇప్పటివరకు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ ఎదుర్కొన్న 12 మందిలో 10 మందికి తాజా గా ఈడీ నోటీసులు ఇచ్చింది.. ఇక మరో ఇద్దరు హీరో రానా, నటి రకుల్ కు మాత్రం మొదటి సారిగా ఈడీ అధికారులు సమన్లు జారీ చేసి విచారించారు. ఇప్పటి వరకు విచారించిన సినీ ప్రముఖుల బ్యాంక్ లావాదేవీలు, డ్రగ్స్ పెడలర్ లతో జరిపిన ట్రాన్సక్షన్ పై ఈడీ దృషి సారించింది. మరోవైపు ఎఫ్ క్లబ్ చుట్టూ డ్రగ్స్ వ్యవహారం తిరుగుతోందని చర్చ నడుస్తోంది. 2015 నుండి 2017 వరకు సాగిన ఎఫ్ లాంజ్ పబ్ లో అనేక పార్టీలు, ఈవెంట్స్, ఎఫ్ లాంజ్ పబ్ బ్యాంక్ ఆడిట్ రీపోర్ట్ తో పాటు నిర్వాహకులు, జనరల్ మేనేజర్ లను సైతం ఈడీ ప్రశ్నించింది.

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ ను ఆగస్ట్ 31 న ఈడీ అధికారులు దాదాపు 10 గంటల పాటు విచారించి స్టేట్ మెంట్ ను నమోదు చేసుకున్నారు. సెప్టెంబర్ 2 న ఛార్మిని సైతం ఈడీ సుమారు 8 గంటల పాటు విచారించిన ఈడి కీలక ఆధారాలు సేకరించింది. మూడవ సెలబ్రిటీ రకుల్ ప్రీత్ సింగ్ ఇచ్చిన డేట్ కంటే మూడు రోజుల ముందే రకుల్ ఈడీ విచారణ కు హాజరైంది. సెప్టెంబర్ 6 న విచారణ కు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఆరోజు బిజీ షెడ్యూల్ ఉన్న కారణంగా ముందు రోజు విచారణ కు హాజరు కావడానికి ఈడీ అధికారుల సుముఖత వ్యక్తం చెయ్యడం తో రకుల్ సెప్టెంబర్ 3 న విచారణ కు హాజరైంది.

గతంలో ఎక్సైజ్ శాఖ విచారణ ఎదుర్కొని రకుల్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో ఎన్సీబి విచారణ ఎదుర్కొంది. ఉదయం 9 గంటలకే ఈడీ కార్యాలయానికి చేరుకున్న రకుల్ ను దాదాపు ఆరు గంటల పాటు ముంబై డ్రగ్స్‌ మాఫియాతో వచ్చిన ఆరోపణలు,ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతాల వివరాలపై ఈడీ అధికారులు కూపీ లాగారు…ఇక మరో నటుడు నంధు సెప్టెంబర్ 20 న హాజరు కావాల్సి ఉండగా సెప్టెంబర్ 7 న ఈడి విచారణ కు హజరయ్యారు.. డ్రగ్స్ కేసులో ఉన్న కీలక నిందితులు కెల్విన్ , జీశాన్ సమక్షంలో నందును దాదాపు ఎనిమిది గంటల పాటు విచారించిది ఈడీ.

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మొట్టమొదటి సారిగా ఈడీ విచారణ కు హీరో దగ్గుబాటి రాణా హాజరయ్యారు. సెప్టెంబర్ 8 న ఉదయం 10 గంటలకు రానా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. రానా తో పాటు ఈడీ విచారణకు వ్యక్తిగత సహాయకులు, చాటెడ్ అకౌంట్ హాజరయ్యారు. చేతి లో బ్లాక్ బ్యాగ్ తో పాటు డాక్యుమెంట్లు, బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసుకొచ్చారు రానా విదేశీ టూర్లు, మనీ ట్రాన్సక్షన్స్ పై కూపీ లాగారు ఈడీ అధికారులు. మని ల్యాండరింగ్, ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘన పై రాణా ను సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఎఫ్ క్లబ్ వ్యవహారాలలో నవదీప్, రకుల్ తో ఉన్న సంబంధాల పై రానా ను ఈడీ ప్రశ్నించింది. సాయంత్రం 5 గంటల 30 నిముషాల ప్రాంతంలో ఈడీ విచారణ ముగించికొని బయట కు వచ్చిన రానా మీడియా తో మాట్లాడదానికి నిరాకరించారు. సుమారు 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన ఈడీ రానా స్టేట్ మెంట్ నమోదు చేసుకుంది.

సెప్టెంబర్ 9 న టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సమన్లు అందుకున్న హీరో రవితేజ, అతని డ్రైవర్ శ్రీనివాస్ ఈడీ విచారణ కు హాజరయ్యారు. 10 గంటల ప్రాంతంలో ఈడీ కార్యాలయానికి చేరుకున్న రవితేజ ను అతని డ్రైవర్ శ్రీనివాస్ ను సుదీర్ఘంగా ఈడీ అధికారులు ప్రశ్నించారు. డ్రగ్స్ కేసులో నిందితుడైన జి ల్న్ అలీ ఖాన్ ఈడి కార్యాలయానికి తీసుకొచ్చి రవితేజ ను డ్రైవర్ శ్రీనివాస్ ను ఆరు గంటలపాటు ఈడీ అధికారులు సుధీర్ఘంగా విచారించారు. సెప్టెంబర్ 13 న హీరో నవదీప్,తో పాటు ఎఫ్ లాంజ్ క్లబ్ జీఎం అర్పిత్ సింగ్ ఈడీ విచారణ కు హాజరయ్యారు. నవదీప్ బ్యాంక్ స్టేట్ మెంట్స్ కు సంబంధించిన ఆరెంజ్ ఫైల్ ను వెంట తీసుకుని వచ్చాడు.

2015 నుంచి 18 వరకు నవదీప్ నిర్వహించిన ఎఫ్ లాంజ్ పబ్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా అయినట్లు గతంలో ఎక్సైజ్ శాఖ సేకరించిన ఆధారాల ఆధారంగా నవదీప్ ను ఈడీ ప్రశ్నించింది. డ్రగ్స్ కేసు వెలుగులోకి రాగానే పబ్ ను మూసివేసిన దానిపై ఈడీ నవదీప్ ను ప్రశ్నించింది. ఎఫ్ లాంజ్ పబ్ జనరల్ మేనేజర్ కి కెల్విన్ కి మధ్య జరిగిన ఆర్ధిక లావాదేవిల పై ఈడీ తోమ్మిది గంటల పాటు విచారించింది ఈడీ. సెప్టెంబర్ 15 న ముమైత్ ఖాన్ ను దాదాపు 7 గంటల పాటు విచారించి స్టేట్ మెంట్ నమెదు చేసుకుంది ఈడీ.. సెప్టెంబర్ 17 న తనీష్ ను సైతం సుమారు 7 గంటల పాటు విచారించి లిఖిత పూర్వకంగా తన స్టేట్ మెంట్ నమెదు చేసుకుంది.

టాలివుడ్ డ్రగ్స్ కేసులో కీలకంగా మారిన ఈడీ దర్యాప్తు.. ఇప్పడు ఎలాంటి మలుపు తిరుగుతుందనే ఉత్కంఠ నెలకోంది..ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ లాగా ఈడీ విచారణ వరకే పరిమితం అవుతుందా… లేదా చర్యలకు పూనుకుంటుందా..? అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

Read also: Cantonment: కంటోన్మెంట్‌ను ఎందుకు జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని కోరుతున్నారు? కారణాలేంటి?