Director Sharath: టాలీవుడ్‌లో మరో విషాదం.. క్యాన్సర్‌తో సీనియర్ దర్శకుడు శరత్ కన్నుమూత.. బాలయ్య, సుమన్‌తో హిట్ మూవీస్..

Director Sharath dead: తెలుగు చలన చిత్ర పరిశ్రమ(Tollywood) లో మరో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ సినీ దర్శకుడు శరత్ క‌న్నుమూశారు. గత కొంత‌ కాలంగా క్యాన్సర్ (cancer) తో బాధ‌ప‌డుతున్న..

Director Sharath: టాలీవుడ్‌లో మరో విషాదం.. క్యాన్సర్‌తో సీనియర్ దర్శకుడు శరత్ కన్నుమూత.. బాలయ్య, సుమన్‌తో హిట్ మూవీస్..
Director Sharath
Follow us
Surya Kala

|

Updated on: Apr 01, 2022 | 12:54 PM

Director Sharath dead: తెలుగు చలన చిత్ర పరిశ్రమ(Tollywood) లో మరో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ సినీ దర్శకుడు శరత్ క‌న్నుమూశారు. గత కొంత‌ కాలంగా క్యాన్సర్ (cancer) తో బాధ‌ప‌డుతున్న శ‌ర‌త్ కుమార్‌.. ఆరోగ్యం క్షీణించడంతో.. ఇవాళ మృతి చెందాడు. హైదరాబాద్‌ లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 9గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో టాలీవుడ్ లో విషాదం నెలకొంది. పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. రేపు 11గంటలకు మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు

శరత్ తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చాదస్తపు మొగుడు సినిమాతో దర్శకుడుగా పరిచయమయ్యారు. ఈ సినిమా ‘డియర్‌’ అనే నవల ఆధారంగా తెరకెక్కింది. సుమన్ , భానుప్రియ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చాదస్తపు మొగుడు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం శరత్ దాదాపు 20 సినిమాలకు దర్శకత్వం వహించారు. ముఖ్యంగా సుమన్ , బాలకృష్ణ లతో సూపర్ హిట్స్ అందుకున్నారు.

బాలక్రిష్ణతో వంశానికి ఒక్కడు, పెద్దన్నయ్య, సుల్తాన్, వంశోద్దరకుడు వంటి హిట్ సినిమాలను తెరకెక్కించారు. సుమన్ తో చాదస్తపు మొగుడు, పెద్దింటి అల్లుడు, బావ‌-బావ‌మ‌రిది,చిన్నల్లుడు వంటి సినిమాలు తెర‌కెక్కించాడు. అయితే శరత్ కు పెళ్లి కాలేదు.. ఆయన మృతితో ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.

Also Read: Drugs Case: మద్యం మత్తులో మూడు రకాల డ్రగ్స్.. సంచలన వివరాలను వెల్లడించిన డాక్టర్ రుక్మిణి..