Viral Photo: ముద్దులొలికేలా ఉన్న ఈ చిన్నారి అబ్బాయిల దిల్ క్రష్.. పిల్లి కళ్లతోనే యూత్‌ను మాయ చేసింది…
సోషల్ మీడియాలో ప్రతిరోజూ సరికొత్త ఛాలెంజెస్ వస్తుంటాయి. వాటిని స్వీకరించడానికి నెటిజన్స్ సైతం తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.
సోషల్ మీడియాలో ప్రతిరోజూ సరికొత్త ఛాలెంజెస్ వస్తుంటాయి. వాటిని స్వీకరించడానికి నెటిజన్స్ సైతం తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఐస్ బకెట్ ఛాలెంజ్.. డ్యాన్స్ ఛాలెంజ్, సింగింగ్ ఛాలెంజ్ ఇలా ఎన్నో రకాల సవాల్లు నెట్టింట్లో ట్రెండ్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో త్రోబ్యాక్ పిక్ అంటూ సరికొత్త ఛాలెంజ్ హల్చల్ చేస్తుంది. ఇందులో తమ రేర్ చిన్ననాటి ఫోటోస్ షేర్ చేస్తుండగా.. వారు ఎవరో గుర్తుపట్టేందుకు నెటిజన్స్ కూడా తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ త్రోబ్యాక్ పిక్ ఛాలెంజ్‌లో సెలబ్రెటీ ఫోటోస్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. తమ అభిమాన స్టార్ హీరోహీరోయిన్లను గుర్తించేందుకు ఫ్యాన్స్ ట్రై చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఓ చిన్నారి ఫోటో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తుంది. పైన ఫోటోలో చూశారు కదా.. ముద్దులొలికెలా ఉన్న ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి. మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరయ్యింది. పిల్లికళ్లతోనే యూత్ ను మాయ చేసింది గుర్తుపట్టండి.. తెలుగులో పలు చిత్రాల్లో నటించి ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. గుర్తించండి.
పైన ఫోటోలో ఉన్న చిన్నారి టాలీవుడ్ హీరోయిన్ స్నేహా ఉల్లాల్. ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది ఈ ముద్దుగుమ్మ. పిల్లికళ్లతో అచ్చం బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్‌లా కనిపించడంతో అందరూ జూనియర్ ఐశ్వర్య అంటూ పిలిచేవారు. సింహా, కరెంట్, నేను మీకు తెలుసా, కింగ్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. గత కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటుంది స్నేహా.
View this post on Instagram
Also Read: Gaalivaana: జీ5లో మరో థ్రిల్లింగ్ వెబ్ సిరిస్.. గాలివాన ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Raviteja: రవితేజ సరసన బాలీవుడ్ బ్యూటీ.. టైగర్ నాగేశ్వర్ రావుకు జోడీ ఎవరంటే..
Acid Reflux: తిన్న తర్వాత ఛాతీలో మంటగా ఉంటుందా ?.. ఇలా చేస్తే తొందరగా రిలీఫ్..
Coffee Benefits: కాఫీ తాగడం వల్ల ఈ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు.. రోజుకు ఎన్ని కప్పులు తాగాలంటే..