AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drugs Case: మద్యం మత్తులో మూడు రకాల డ్రగ్స్.. సంచలన వివరాలను వెల్లడించిన డాక్టర్ రుక్మిణి..

డ్రగ్స్(Drugs) కారణంగా చనిపోయిన విద్యార్ధికి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ రుక్మిణీ(Dr. Rukmini) కీలక విషయాలు వెల్లడించారు. మద్యం మత్తులో మూడు రకాల డ్రగ్స్ తీసుకున్నట్టు తెలిపారు. అన్ని రకాల డ్రగ్స్ తీసుకోవడం..

Drugs Case: మద్యం మత్తులో మూడు రకాల డ్రగ్స్.. సంచలన వివరాలను వెల్లడించిన డాక్టర్ రుక్మిణి..
Student Who Died Due To Dru
Sanjay Kasula
|

Updated on: Apr 01, 2022 | 12:14 PM

Share

డ్రగ్స్(Drugs) కారణంగా చనిపోయిన విద్యార్ధికి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ రుక్మిణీ(Dr. Rukmini) కీలక విషయాలు వెల్లడించారు. మద్యం మత్తులో మూడు రకాల డ్రగ్స్ తీసుకున్నట్టు తెలిపారు. అన్ని రకాల డ్రగ్స్ తీసుకోవడం వల్ల వైద్యం చేయడం కష్టంగా మారింది. ఐసీయూలో చికిత్స అందించినా సహకరించలేదని తెలిపారు. రెండో రోజే శ్వాస తీసుకోలేకపోవడంతో వెంటిలేటర్ వైద్యం అందించాల్సి వచ్చిందన్నారు. శరీరం లోపల మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అవడంతో.. ప్రాణాలు కాపాడలేకపోయామని చెప్తున్నారు డాక్టర్ రుక్మిణీ. ఇదిలావుంటే.. మరో డ్రగ్ సప్లయర్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ సప్లై చేస్తున్న ఓ సాప్ట్‌వేర్ ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫోటోలో కనిపిస్తున్న ఈమె పేరే మాన్సీ. నాచారంలో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. భర్త మదన్‌ మనేకర్‌తో కలిసి రెండేళ్లుగా గంజాయి విక్రయిస్తోంది.

అరకు నుంచి సరకు తీసుకొచ్చి.. మల్కాజిగిరి, నాచారం, మేడ్చల్‌, పంజాగుట్ట, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో దందా షురూ చేశారు. మార్చి 12న మాన్సీ దంపతులు.. మరో ఇద్దరు యువకులతో కలిసి గంజాయి అమ్ముతుండగా బోయిన్‌పల్లి పోలీసుల కంట్లో పడ్డారు. కిలో గంజాయితో యువకులిద్దరూ చిక్కగా దంపతులు పారిపోయారు.

వారిచ్చిన సమాచారంతో గాలిస్తుండగా కొంపల్లి దగ్గర మాన్సీని పట్టుకున్నారు. ఏపీకి చెందిన ఆమె కుటుంబీకులు.. నాగ్‌పుర్‌ జిల్లాలో స్థిరపడ్డారు. భోపాల్‌లో ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన మాన్సీ.. ఉద్యోగం కోసం హైదరాబాద్‌ వచ్చింది. నాచారంలో మూడేళ్లుగా డ్రగ్స్ దందా సాగిస్తోంది మాన్సీ.

డ్రగ్స్‌కి బానిసలవుతున్న విద్యార్ధుల్ని ఆ మురికికూపం నుంచి బయటపడేసేందుకు పోలీసులు కఠినచర్యలు తీసుకుంటున్నారు. ఈ కేసును ఛేదించేందుకు రంగంలోకి నార్కోటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ దిగింది. నిందితుల సెల్ ఫోన్ డేటా ఆధారంగా.. దర్యాప్తు ముమ్మరం చేశారు నల్లకుంట పోలీసులు.

డ్రగ్స్ కు బానిసై మృతి చెందిన కేసులో సంచలన విషయాలు బయటపడడంతో తల్లిదండ్రులు ఉలిక్కిపడుతున్నారు. గోవా కేంద్రంగానే మొత్తం డ్రగ్స్ రాకెట్ నడిచినట్టు గుర్తించిన పోలీసులు ఆ దిశగా విచారిస్తున్నారు. ఐదుగురు హైదరాబాద్ బీటెక్ విద్యార్థులతో పాటు నలుగురు డీజేలు కలిసి డ్రగ్స్ పార్టీ నిర్వహించారు.

హైదరాబాద్‌‌లో డ్రగ్స్‌కు బానిసై ప్రాణాలు కోల్పోయిన బీటెక్ విద్యార్థి మరణంలో అనేక సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నల్లకుంట పోలీసులు అదుపులో ముగ్గురు డ్రగ్స్ వాడుతున్న వ్యక్తులు ఉన్నారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి: Rahul Gandhi: ముందస్తు ఎన్నికలు వస్తున్నాయి.. రాహుల్‌ పర్యటనలో ఆంతర్యం అదే..

Skin Care Tips: వేసవిలో మొటిమలు, జిడ్డు చర్మంతో ఇబ్బంది పడుతున్నారా.. శ్రీ గంధంతో ఇలా చెక్ పెట్టండి..