Chicken Fight: రెండు వర్గాల మధ్య చికెన్‌ ముక్క చిచ్చు.. వేములవాడ మండలంలో రచ్చ రచ్చ..

చికెన్‌ ముక్క రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో చికెన్‌ కోసం రెండు వర్గాలు తలలు పగేలా కొట్టుకున్నారు. రక్తం కారేలా కర్రలతో ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు.

Chicken Fight: రెండు వర్గాల మధ్య చికెన్‌ ముక్క చిచ్చు.. వేములవాడ మండలంలో రచ్చ రచ్చ..
Chicken Fight
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 01, 2022 | 8:18 AM

చికెన్‌(Chicken) ముక్క రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో చికెన్‌ కోసం రెండు వర్గాలు తలలు పగేలా కొట్టుకున్నారు. రక్తం కారేలా కర్రలతో ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. వేములవాడ మండలం(vemulawada mandal) తిప్పాపూర్‌లో ఈ ఇన్సిడెంట్‌ జరిగింది. చికెన్‌ వాసన వస్తోందంటూ ప్రశ్నిచడంతో.. అది కాస్త గొడవకు దారి తీసింది. మాట మాట పెరగడంతో షాపు యజమానిపై దాడికి ప్రయత్నించారు. అయితే చికెన్‌ సెంటర్‌ వర్గం రివర్స్‌లో ఎటాక్‌ చేయడంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. ఈ చికెన్ సెంటర్‌ ఓనర్‌కు సన్నిహితులు కూడా ఇందులో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ప్రశ్నించేందుకు వచ్చిన వారిపై స్థానికులు కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. అంతేకాకుండా చికెన్‌ క్లీనింగ్ కోసం ఉపయోగించే వేడి నీటిని వారిపై పోశారు. వేడి వేడి నీరు వారిపై పడటంతో దిక్కుతోచని స్థితిలో పరుగులు పెట్టారు. చికెట్ సెంటర్ నిర్వాహకులు వేడి నీటిని మాత్రమే పోయకుండా వారిని కర్రలతో చితకబాధారు.

చికెన్‌ సెంటర్‌ వర్గం ఎటాక్‌లో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవాళ్లను సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘర్షణలో యాసిడ్‌ ఎటాక్‌ కూడా చేయడంతో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. దాడి చేసిన చికెంట్ సెంటర్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో యాసిడ్ దాడి జరిగిదా..? అయితే యాసిడ్ దాడి జరిగితే వీరికి యాసిడ్ ఎలా వచ్చిందనే కోణంలో విచారణ జరిపేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

ఇవి కూడా చదవండి: Rahul Gandhi: ముందస్తు ఎన్నికలు వస్తున్నాయి.. రాహుల్‌ పర్యటనలో ఆంతర్యం అదే..

Skin Care Tips: వేసవిలో మొటిమలు, జిడ్డు చర్మంతో ఇబ్బంది పడుతున్నారా.. శ్రీ గంధంతో ఇలా చెక్ పెట్టండి..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!