Sapthagiri: తెలుగు కమెడియన్ ఇంట్లో విషాదం.. నటుడు సప్తగిరికి మాతృవియోగం..
తెలుగు కమెడియన్ సప్తగిరి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి చిట్టెమ్మ కన్నుమూసినట్లు సమాచారం. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సప్తగిరి తల్లి చిట్టెమ్మ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అధికారికంగా వెల్లడించారు నటుడు సప్తగిరి.

టాలీవుడ్ కమెడియన్ సప్తగిరి ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి చిట్టెమ్మ కన్నుమూశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు సప్తగిరి. కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో పోరాడుతున్న ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచారు. బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించినట్లు సమాచారం. ఈరోజు ఆమె భౌతికయాన్ని తిరుపతిలోని ఆమె స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారని కుటుంబసభ్యులు తెలిపారు. నేడు తిరుపతికి చిట్టెమ్మ భౌతికకాయానికి నివాళులర్పించడానికి సినీప్రముఖులు రానున్నారు.
తెలుగు చిత్రపరిశ్రమలో హాస్యనటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సప్తగిరి. అతడి అసలు పేరు వెంకట ప్రభు ప్రసాద్ కాగా.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సప్తగిరి. సహాయ దర్శకుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన సప్తగిరి.. అల్లు అర్జున్ నటించిన పరుగు సినిమాలో నటుడిగా కనిపించి పాపులర్ అయ్యారు. ఆ తర్వాత ప్రేమకథా చిత్రమ్, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో అనేక చిత్రాల్లో హాస్యనటుడిగా కనిపించాడు. అలాగే కొన్ని సినిమాల్లో హీరోగానూ కనిపించాడు.
ఇవి కూడా చదవండి :




