IPL 2025: ఐపీఎల్‏లో చరిత్ర సృష్టించిన ఆర్సీబీ.. టాలీవుడ్ సెలబ్రెటీల రియాక్షన్ ఇదే..

ఎట్టకేలకు 18వ ప్రయత్నంలో ఆర్సీబీ ఐపీఎల్ కల సాకారమైంది. అహ్మదాబాద్‏లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‏లో పంజాబ్ కింగ్స్ తో ఆర్సీబీ తలపడింది. చివరివరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ ఓడిన ఆర్సీబీ చివరకు ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిచింది. ఆర్సీబీ విజయంతో విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యారు.

IPL 2025: ఐపీఎల్‏లో చరిత్ర సృష్టించిన ఆర్సీబీ.. టాలీవుడ్ సెలబ్రెటీల రియాక్షన్ ఇదే..
Allu Arjun, Rashmika Mandan

Updated on: Jun 04, 2025 | 7:15 AM

ఎన్నో సంవత్సరాల కల నెరవేరింది. ఎట్టకేలకు 18వ ప్రయత్నంలో ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ డ్రీమ్ నిజమైంది. జూన్ 3న అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా జరిగిన పైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ మధ్య ఉత్కంఠ పోరు సాగింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆర్సీబీ చేసిన 191 లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమై 6 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. IPL 2025 ఫైనల్‏లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (RCB) తొలి ట్రోఫీని ముద్దాడింది. దీంతో ఆర్సీబీ సుధీర్ఘ నిరీక్షణకు తెరదించింది. ఐపీఎల్ 18వ సీజన్ లో 8వ ఛాంపియన్ గా నిలిచింది రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు.

తొలి సీజన్ నుంచి ఆర్సీబీకే ప్రాతినిధ్యం వహిస్తోన్న విరాట్ కోహ్లీ మ్యాచ్ అనంతరం భావోద్వేగానికి గురయ్యాడు. ఈ విజయం తనతోపాటు తన అభిమానులకు సైతం ప్రత్యేకమని వ్యాఖ్యనించాడు. ఈ సందర్భంగా తన భార్య అనుష్క శర్మను హగ్ చేసుకుని భావోద్వేగానికి గురయ్యాడు. అనంతరం ఆర్సీబీ ఆటాగళ్లతో కలిసి సంబరాలు చేసుకున్నారు. మరోవైపు ఆర్సీబీ విజయం పై సినీతారలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. అల్లు అర్జున్, రణవీర్ సింగ్, రష్మిక మందన్నా, సోనూ సూద్ తదితరులు ఆర్సీబీ శుభాకాంక్షలు తెలిపారు.

అల్లు అర్జున్ ట్వీట్..

ప్రశాంత్ నీల్.. 

రష్మిక మందన్నా..  

Rashmika

సోనూసూద్ ట్వీట్.. 

కిరణ్ అబ్బవరం.. 

శివరాజ్ కుమార్.. 

 

ఇవి కూడా చదవండి :  

OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..

Nagarjuna: టాలీవుడ్‏ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..

Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..

OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..