- Telugu News Photo Gallery Cinema photos Actress Samantha stuns every one in gold colour saree in Dubai event, See photos
Samantha: దుబాయ్‌లో సమంత సందడి.. చీరకట్టులో ఎంత అందంగా ఉందో చూశారా? ఫొటోస్ ఇదిగో
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత దుబాయ్‌లో సందడి చేసింది. ఓ ఈవెంట్‌కు హాజరైన ముద్దుగుమ్మ గోల్ట్ కలర్ శారీలో మెరిసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది సమంత. ఇవి సినీ అభిమానులు, నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
Updated on: Jun 04, 2025 | 9:42 AM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవల ఆమె నటించి, నిర్మించిన శుభం సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.

తన ట్రాలాలా బ్యానర్ పై సమంత నిర్మించిన ఈ సినిమా థియేటర్లలో మంచి వసూళ్లనే రాబట్టింది. ఇప్పుడీ కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి రానుంది.

సమంత ప్రస్తుతం 'రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్' అనే కొత్త వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇప్పటికే చాలా భాగం ఈ సిరీస్ పూర్తయినట్లు తెలుస్తోంది.

కాగా తాజాగా దుబాయ్ లో సందడి చేసింది సమంత. ఓ స్పెషల్ ఈవెంట్ కోసం గోల్డ్ కలర్ శారీలో ముస్తాబై వచ్చిందీ ముద్దుగుమ్మ.

ఈ సందర్భంగా సమంతను చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా అందరితో కలిసి సరదాగా ఓ సెల్ఫీ దిగింది సామ్.

దుబాయ్ ఈవెంట్ కు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది సామ్. ప్రస్తుతం ఇవి నెటిజన్లన అమితంగా ఆకట్టుకుంటున్నాయి.




