Taapsee Pannu: నువ్వు సల్లగుండాలమ్మా! పేదల దాహార్తిని తీర్చేందుకు హీరోయిన్ తాప్సీ ఏం చేసిందో తెలుసా? వీడియో
స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను మరోసారి తన గొప్ప మనసును చాటుకుంది. ఇటీవలే పేదలకు ఉచితంగా ఫ్యాన్లు అందజేసిన ఆమె తాజాగా ఢిల్లీలోని మురికివాడల వాసులకు ఫ్రీగా వాటర్ కూలర్లను పంపిణీ చేసింది. తద్వారా మండు వేసవిలో వారి దాహార్తిని తీర్చేందుకు తన వంతు ప్రయత్నం చేసింది.

స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను ఇప్పుడు గతంలో ఉన్నంత బిజీగా లేదు. ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సెలెక్టివ్ గా మాత్రమే మూవీస్ చేస్తోంది. అయితే ఈ బ్యూటీ ప్రస్తుతం సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది. కొన్ని రోజుల క్రితం, తాప్సీ మురికివాడల వాసులకు ఫ్యాన్లను ఉచితంగా పంపిణీ చేసింది. ఇప్పుడు వారికి వాటర్ కూలర్లు ఉచితంగా ఇచ్చింది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది తాప్సీ. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి . కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నప్పటికీ, చాలా చోట్ల ఉష్ణోగ్రతలు దంచి కొడుతున్నాయి. ఢిల్లీ వంటి నగరాల్లో ఉష్ణోగ్రతలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్రమంలోనే పేదల దీనస్థితి గురించి తెలుసుకున్న తాప్సీ పన్ను ఢిల్లీలోని మురికివాడలకు వెళ్లింది. అక్కడి వారికి వాటర్ కూలర్లు ఇవ్వడమే కాకుండా వాటి వినియోగం గురించి వివరించింది. తాప్సీ పన్ను ఒక NGOతో చేతులు కలిపింది. ఇప్పుడు కూడా ఆ బృందం తోనే ఇంటింటికీ వెళ్లి వాటర్ కూలర్లను పంపిణీ చేసింది. ఈ సందర్భంగా పేదలు అందరూ తాప్సీకి కృతజ్ఞతలు తెలిపారు.
తాప్సీ సేవా కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసన వారందరూ హీరోయిన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాప్పీ మనసూ అందమైనదేనంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఆమె మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలంటున్నారు. కాగా 2010 నుంచి సినిమాల్లో నటిస్తోంది తాప్సీ. తెలుగులో ఓ వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ లోనూ సత్తా చాటుతోంది. అలాగే తమిళ్, మలయాళ సినిమాల్లోనూ మెరుస్తోంది.
వాటర్ కూలర్లు అందజేస్తోన్న హీరోయిన్ తాప్సీ.. వీడియో..
View this post on Instagram
హీరోయిన్ తాప్సీ గతేడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తన ప్రియుడు, డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో ఏడడుగులు వేసింది. అంతేకాదు కొన్ని రోజుల క్రితం ఇద్దరూ కలిసి ఇదే పేదలకు ఉచితంగా ఫ్యాన్లు పంపిణీ చేశారు.
ఫొటోస్ ఇదిగో..
View this post on Instagram
కూలింగ్ ఫ్యాన్స్ పంపిణీ చేస్తూ..
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .




