AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ ఎన్‌సీసీ కమాండర్‌ను గుర్తు పట్టారా? హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్ టు టాలీవుడ్ టాప్ యాక్ట్రెస్..

ప్రస్తుతం సినిమా స్టార్స్ గా వెలుగొందుతోన్న చాలా మంది కెరీర్ ప్రారంభంలో వివిధ రగాల ఉద్యోగాలు, పనులు చేసిన వారే. ఈ టాలీవుడ్ నటి కూడా ఈ జాబితాకే చెందుతుంది. ఎంబీఏ పూర్తి చేసి ఒక కంపెనీలో హెచ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ గా కెరీర్ ప్రారంభించింది.

Tollywood: ఈ ఎన్‌సీసీ కమాండర్‌ను గుర్తు పట్టారా? హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్ టు టాలీవుడ్ టాప్ యాక్ట్రెస్..
Tollywood Actress
Basha Shek
|

Updated on: May 15, 2025 | 11:22 AM

Share

ఎన్‌సీసీ డ్రెస్‌లో ఉన్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడామె టాలీవుడ్ లో బాగా ఫేమస్. న్యూస్ రీడర్ గా , టీవీ యాంకర్ గా, నటిగా, విలన్ గా మల్టీ ట్యాలెంటెడ్ వుమన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తన అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. మొదట బుల్లితెరపై ఓ వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వెండితెరపై కూడా సత్తా చాటుతోంది. స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ మెప్పిస్తోంది. కాగా ఈ నటి చిన్నప్పుడు చదువుతో పాటు ఎక్స్ ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో చురుగ్గా పాల్గొనేది. స్కూల్ లెవల్లో AP జూనియర్ వింగ్ NCC కమాండర్ గా వ్యవహరించింది. ఎన్నో బహుమతులు కూడా గెల్చుకుంది. ఇక పై ఫొటో విషయానికి వస్తే.. 2000 సంవత్సరంలో న్యూఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలో జరిగినప్పుడు తీసిన ఫోటో అది. అంటే ఇప్పటికీ దాదాపు 25 ఏళ్లు గడిచిపోయిందన్నమాట. మరి ఇందులో ఉన్నదెవరో గుర్తు పట్టారా? తను మరెవరో కాదు స్టార్ యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ. గురువారం (మే 15) ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ ముద్దుగుమ్మ కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అలాగే అనసూయకు సంబంధించిన చిన్న నాటి ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

కాగా ప్రస్తుతం వెండితెరపైనే దృష్టి కేంద్రీకరించింద అనసూయ. వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటోంది. చివరిగా పుష్ప 2 సినిమాలో కనిపించిన ఈ అందాల తార ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటించిన హరి హర వీరమల్లులో ఓ కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే సినిమాలో ఆమెకు సంబంధించిన స్టిల్స్ నెట్టింట వైరలవుతున్నాయి. ముఖ్యంగా కొల్లగొట్టినాదిరో సాంగ్ లో పవన్ తో కలిసి స్టెప్పులేసిందీ అందాల తార. దీంతో పాటు మరో రెండు సినిమాలు అనసూయ చేతిలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

కొత్తింట్లోకి అడుగు పెడుతోన్న అనసూయ.

ఇక అప్పుడప్పుడూ టీవీ షోల్లోనూ సందడి చేస్తోందీ అందాల తార. ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకు ఉండే క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

గ్లామరస్ లుక్ లో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.