AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: ‘ఆ సినిమాలు చేసి ఉండాల్సింది కాదు.. చాలా చెత్తగా’.. సమంత షాకింగ్ కామెంట్స్

సమంతా రూత్ ప్రభు సినీ పరిశ్రమలోకి ప్రవేశించి సుమారు 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2010 లో ఏ మాయ చేశావే మూవీతో అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సామ్ ఇప్పుడు కొంచెం స్లో అయ్యింది.

Samantha: 'ఆ సినిమాలు చేసి ఉండాల్సింది కాదు.. చాలా చెత్తగా'.. సమంత షాకింగ్ కామెంట్స్
Actress Samantha
Basha Shek
|

Updated on: Mar 05, 2025 | 9:35 AM

Share

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు కెరీర్ కొనసాగిస్తోన్న హీరోయిన్లలో సమంతా రూత్ ప్రభు ఒకరు. ఆమె 2010 లో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఈ కాలంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక నటిగా అన్ని రకాల పాత్రలను పోషించిందీ అందాల తార. అదే సమయంలో కొన్ని సినిమాల్లో గ్లామరస్ గానూ కనిపించింది. అయితే, సమంత ఇప్పుడు అలాంటి పాత్రలు చేయాల్సింది కాదేమోనంటోంది. ‘ సినిమా ఇండస్ట్రీలో నటిగా జీవితమంటే ఎంతో ఒత్తిడితో కూడుకున్నది. ప్రతి సినిమా విజయం నా ఆత్మగౌరవాన్ని పెంచింది. నేను విజయాన్ని మాటల్లో నిర్వచించలేను. కెరీర్ ప్రారంభంలో నేను బాగా టెన్షన్ పడతాను. నా సినిమాలు సక్సెస అవుతాయా? కాదా? అని ఆందోళన చెందాను. కానీ నాకు ఇప్పుడు ఒక క్లారిటీ ఉంది. ‘ సినిమాల్లో కొన్ని పాత్రలు చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. అయితే ఇప్పుడు నేను ఆ సినిమాలు చూస్తున్నప్పుడు, నా పాత్రలు నాకు హాస్యాస్పదంగా అనిపిస్తాయి. ఆ సినిమాలు చేసి ఉండాల్సింది కాదు’ అని సమంత చెబుతోంది.

సమంత ‘ఏ మాయ చేసావే’ సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత ‘బృందావనం’, ‘దూకుడు’, ‘అత్తారిటికి దారేది’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ తదితర సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే ఏ మాయ చేశావేకు ముందు ఒక తమిళ చిత్రంలో నటించింది సామ్. అందులో గ్లామర్ ఒలకబోసింది. బహుశా ఇప్పుడు ఆ సినిమా గురించేనేమో సామ్ ఇప్పుడు ఫీలవుతోంది.

ఇవి కూడా చదవండి

సినిమా ఇండస్ట్రీలో 15 ఏళ్ల ప్రస్థానం..

సమంత 2023లో ‘శాంకుంతలం’, ‘ఖుషి’ చిత్రాల్లో నటించింది. వీటిలో ‘ఖుషి’ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక గతేడాది హనీ బన్నీసిటాడెల్ వెబ్ సిరీస్‌తో మన ముందుకు వచ్చింది సామ్. ప్రస్తుతం ఆమె ‘రక్తబ్రహ్మండ: ది బ్లడీ కింగ్‌డమ్’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు.

సమంత లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి