Tollywood: వామ్మో.. ఇంట్లో 16 అడుగుల కింగ్ కోబ్రా.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌కు ఎంత ధైర్యమో చూశారా? ఒళ్లు గగుర్పొడిచే వీడియో
సాధారణంగా మనం పాము పేరు వింటేనే భయపడిపోతాం. ఆ చుట్టు పక్కల ఉండకుండా ఆమడ దూరం పరిగెత్తుతాం. అలాంటిది ఈ టాలీవుడ్ హీరోయిన్ మాత్రం ఏకంగా 16 అడుగుల కింగ్ కోబ్రాను పట్టేసి అడవిలోకి తీసుకెళ్లి వదిలి పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

విశాఖపట్నం సమీపంలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతం అరకు. ఇక్కడ నిర్మిస్తోన్న ఓ భవనంలోకి 16 అడుగుల కింగ్ కోబ్రా దూరింది. దీంతో స్థానికులు భయపడిపోయి స్నేక్ క్యాచర్ అండ్ రెస్క్యూ టీమ్ కు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న రెస్క్యూటీమ్ వెంటనే అక్కడకు వచ్చింది. అయితే వారితో పాటు ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొంది. తాచుపామును పట్టుకుని పోయి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టింది. సాధారణంగా మనం చిన్న పాము కనిపిస్తేనే భయపడిపోతాం. అలాంటిది ఈ హీరోయిన్ మాత్రం ఎంతో ధైర్యంగా 16 అడుగుల తాచు పామును పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించింది. రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొని పామును క్షేమంగా తీసుకెళ్లిపోయి దట్టమైన అడవి ప్రాంతంలో వదిలిపెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన వారందరూ ఈ టాలీవుడ్ హీరోయిన్ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. ఇదే సందర్భంగా పాములను చంపడం మంచిది కాదని ఆమె ఇచ్చిన సందేశం కూడా చాలా బాగుందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ 16 అడుగుల తాచుపామును ధైర్యంగా పట్టుకున్న ఆ హీరోయిన్ మరెవరో కాదు.. ‘ వెళ్లవయ్యా వెళ్లు’ అంటూ తెలుగు ఆడియెన్స్ ను అలరించిన సదా.
ప్రస్తుతం సినిమాలు, టీవీ షోలకు దూరంగా ఉంటోంది హీరోయిన్ సదా. వైల్డ్ ఫొటోగ్రఫీ అంటే ఎంతో ఇష్టమున్న ఆమె నిత్యం అడవుల్లో తిరుగుతూ ఎన్నో రకాల పక్షులు, జంతువులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తీస్తూ అభిమానులతో షేర్ చేసుకుంటోంది. అలా తాజాగా ఆమె తన యూట్యూబ్ ఛానల్ లో ఓ కింగ్ కోబ్రాను పట్టుకుని అడవిలో వదిలిపెట్టే వీడియోను షేర్ చేసింది. ఇదే సందర్భంగా ఓ సామాజిక సందేశాన్ని కూడా పంచుకుంది.
‘ ఎవరికైనా పాములు కనిపిస్తే.. దయ చేసి వాటిని చంపకండి. పాములు లేకపోతే ఎకో సిస్టమ్ పూర్తిగా దెబ్బ తింటుంది. మీకు ఎక్కడైనా పాములు కనిపిస్తే భయపడకుండా వెంటనే రెస్క్యూ టీమ్ కు కాల్ చేయండి. మన చుట్టూ ఎన్నో రెస్క్యూ టీమ్స్ ఉన్నాయి. మనం గూగుల్ సెర్చ్ చేసినా వారి ఫోన్ నెంబర్స్ తదితర వివరాలు మనకు కనిపిస్తాయి. వెంటనే వారికి ఫోన్ చేసి పాములను పట్టించండి. వాటిని చంపకుండా దూరంగా అటవీ ప్రాంతంలో వదిలేయండి’ అంటూ సూచనలిచ్చింది సదా. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
రెస్క్యూ ఆపరేషన్ లో హీరోయిన్ సదా.. వీడియో ఇదిగో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




