Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పనిమనిషితో యవ్వారం.. ఉరితాడుకు పెళ్లాం..! సస్పెన్స్‌తో నరాలు తెగిపోవడం పక్కా

పనిమనిషితో యవ్వారం.. ఉరితాడుకు పెళ్లాం..! సస్పెన్స్‌తో నరాలు తెగిపోవడం పక్కా

Phani CH
|

Updated on: Jun 22, 2025 | 2:24 PM

Share

ఇప్పుడు థియేటర్ కి వెళ్లి సినిమా చూడడం కంటే ఇంట్లో కూర్చుని ఓటీటీ లో సినిమాలు చూడడమే అందరికీ నచ్చుతోంది. అందులోనూ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూసేందుకు జనాలు ఇంట్రెస్ట్ చూపించడం ఎక్కువవుతోంది. అందుకే ఇప్పుడు మీకు ఒక సినిమా గురించి చెప్పబోతున్నాను. ఈ తెలుగు సినిమా మీ అందరికీ కచ్చితంగా మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది.

థియేటర్ లో సో సోగా ఆడిన ఈ టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ జూన్ 13న ఓటీటీ లోకి వచ్చింది. బిగ్ స్క్రీన్ పై అంతగా ఆకట్టుకోని ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ పై మాత్రం దూసుకుపోతోంది. అమెజాన్ ప్రైమ్ లో ఇండియా వ్యాప్తంగా ఏకంగా టాప్ టు లో ట్రెండ్ అవుతోంది. ఇది ఒక హైదరాబాద్ లో జరిగే ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. మర్డర్ మూవీ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమా స్పెషల్ ఏంటంటే నిడివి చాలా తక్కువ. కానీ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, దిమ్మతిరిగే ట్విస్ట్ లు ఆడియన్స్ ను కట్టిపడేస్తాయి. ఇక ఈ సినిమా స్టోరీ ఏంటంటే జయరాం అనే ఒక వ్యాపారవేత్త తన భార్య దివ్యతో తరచూ గొడవలు పడుతుంటాడు. ఒకరోజు ఆ గొడవ పీక్స్ కి వెళుతుంది. దాంతో జయరాం భార్యపై చేయి చేసుకుంటాడు. అయితే ఆ తర్వాత కొన్ని గంటలకే దివ్య తన బెడ్ రూమ్ లో ఉరి వేసుకొని కనిపిస్తుంది. అందరూ దాన్ని ఆత్మహత్య అనుకుంటారు. దీంతో పనిమనిషి వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తుంది. రంగంలోకి దిగిన పోలీస్ ఆఫీసర్ నవీన్ చంద్ర దివ్య మరణం ఆత్మహత్య కాదని భావిస్తాడు. అతని ఇన్వెస్టిగేషన్ లో ఇది హత్య అని నిర్ధారణ అవుతుంది. దీంతో పోలీసులు జయరాం, అతని సవతి పిల్లలు, పనిమనిషి, జయరాం సోదరుడైన సీఐఏ ఆఫీసర్ ను విచారిస్తారు. విచారణలో అందరూ అనుమానితులుగానే కనిపిస్తారు. కానీ దివ్య మరణానికి ఏ ఒక్కరూ కారణం కాదని తెలుస్తుంది. అదే సమయంలో పనిమనిషికి జయరాంకి మధ్య ఎఫైర్ నడుస్తుందన్న విషయం పోలీసులకు తెలుస్తుంది. కానీ దివ్య హత్యకు అదొక్కటే కారణం కాదని కూడా తెలుస్తుంది. మరి ఆమె మరణానికి నిజమైన కారణం ఏమిటి? పోలీసులు ఈ కేసును ఎలా ఛేదిస్తారు? అసలు హంతకుడు ఎవరన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఆ.. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ని చూడాలంటే ఈ సినిమా చూడాలి అండ్ చివరిలో ఉలిక్కిపడటం మాత్రం పక్కా. ఇంతకీ ఈ సిరీస్ పేరు చెప్పలేదు కదా దాని పేరే బ్లైండ్ స్పాట్. అమెజాన్ లో తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. వీలుంటే ఒక లుక్ వేయండి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వేసవి తాపం నుంచి తప్పించుకోడానికి ఇతని ఐడియా అదుర్స్‌

ఖాళీ కడుపుతో కొబ్బరి తింటే అద్భుతమైన ప్రయోజనాలు

అరటి పువ్వా.. అని తీసిపారేయకండి.. వారికి ఇది దివ్యౌషధం

పచ్చి బాదం పప్పు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే వదలరు

కదలకుండా ఉన్న మొసలిని చూసి చనిపోయిందనుకున్నారు.. ఆ తర్వాత