కదలకుండా ఉన్న మొసలిని చూసి చనిపోయిందనుకున్నారు.. ఆ తర్వాత
మొసలి నీటిలో ఉన్నప్పుడు అత్యంత శక్తివంతంగా ఉంటుంది. అదే నేలపైకి రాగానే బలహీనంగా మారిపోతుంది. మొసళ్లు తన ఎరను పట్టుకోడానికి రకరకాల ట్రిక్స్ ఉపయోగిస్తాయి. నీటిలో ఏ ప్రాణి అయినా మొసలి నోటికి చిక్కిందా దాని ఆయుష్షు ముగిసినట్టే. తాజాగా ఓ మత్స్యకారుడికి చెమటలు పట్టించింది ఓ భారీ మొసలి. నీటిలో కదలకుండా ఉన్న మొసలిని చనిపోయిందనుకొని కర్రతో కదిలించాడు.
అంతే అతని పై ప్రాణాలు పైనే పోయినంతపనైంది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. కొందరు మత్స్యకారులు నదిలో బోటు వేసుకొని చేపల వేట కోసం వెళ్తున్నారు. ఇంతలో వారి బోటుకి కొంత దూరంలో ఓ పెద్ద మొసలి కనిపించింది. అది నీటిపైన తేలియాడుతూ ఉంది. దానిని చూసి మత్స్యకారులు చనిపోయింది అనుకున్నారు. బోటును దానికి దగ్గరగా తీసుకువెళ్లినా అది కదల్లేదు. దాంతో ఓ వ్యక్తి కర్రతో మొసలి తలపై గుచ్చాడు. అంతే ఒక్కసారిగా మొసలి ఆ కర్రను విదిలించి కొట్టింది. దెబ్బకు భయంతో ఆ మత్స్యకారులు వణికిపోయారు. అంతే వెంటనే బోటును అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 85 లక్షల మందికి పైగా వీక్షించారు. మూడు లక్షల మందికి పైగా లైక్ చేశారు. మొసలి తెలివితేటలు మామూలుగా లేవుగా అని ఒకరు, మొసళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తేలికగా తీసుకోకూడదని మరొకరు కామెంట్లు చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చెట్ల పొదల్లో కళ్లు చెదిరే సీన్.. ఆశ్చర్యంతో చూస్తుండిపోయిన స్థానికులు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

