చెట్ల పొదల్లో కళ్లు చెదిరే సీన్.. ఆశ్చర్యంతో చూస్తుండిపోయిన స్థానికులు
ఆర్డీవో ఆఫీసు ఆవరణలో వింత శబ్దాలు వినిపించడంతో కార్యాలయ సిబ్బంది కంగారు పడ్డారు. ఏం జరగుతుందో అర్థం కాని సిబ్బంది ఆఫీసు ఆవరణ మొత్తం పరిశీలించారు. కార్యలయం వెనుక ఉన్న చెట్ల పొదల్లో రెండు పెద్ద పాములు కనిపించాయి. దెబ్బకు భయంతో వెనక్కి పరుగులు తీశారు. అయితే ఆ రెండు పాములు సయ్యాటలో మునిగిపోయాయి.
పొదల మధ్య నుంచి బుసలు కొడుతూ రెండు భారీ నాగుపాములు బయటకు వచ్చాయి. అవి రెండూ ఒకదానినొకటి పెనవేసుకొని సయ్యాటలో మునిగితేలుతున్నాయి. అక్కడికి వచ్చిన వారిని కూడా అవి పట్టించుకోలేదు. సుమారు గంటపాటు ఆ జంట పాములు తన్మయత్వంలో మునిగిపోయాయి. ఈ జంటపాముల సయ్యాటను ఎవరో తమ సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది వైరల్‌గా మారింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయం ఆవరణలో జరిగింది. స్థానికులు, సిబ్బంది పాములను చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అవి ఆ స్థితిలో ఉండటం వల్ల ఎవరికీ ఎలాంటి హానీ కలగలేదని, అదే ఆఫీసులోకి చొరబడితే పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యాలయం ఆవరణలో పిచ్చి మొక్కలు పెరిగి ఇలా పాములకు ఆవాసాలుగా మారుతున్నాయని ఆరోపించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘మీ దేశానికి పో !’ యువతితో రాపిడో రైడర్.. దాడి కేసులో ట్విస్ట్
బిచ్చగాడినంటూ ఇంటికి వచ్చాడు.. ఆమె ఒంటరిగా కనిపించేసరికి..
దూసుకొస్తున్న డేంజరస్ డేట్.. భయంతో వణికిపోతున్న జపాన్!
అదనపు కట్నంగా .. కోడలిని ఏం అడిగారో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఊరు ఊరంతా కరెంట్ షాక్.. సెల్ఫోన్ ఛార్జింగ్ పెడుతూ యువకుడు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..

