జంబో పుట్టగొడుగును ఎప్పుడైనా చూశారా ??
వెజిటేబుల్ ప్రియులకు నాన్ వెజ్ రుచిని ఇచ్చే వెజిటేబుల్ వంటకాలలో అందరికీ ముందుగా గుర్తొచ్చేది పుట్టగొడుగులు.. నాన్ వెజ్ ప్రియులు చికెన్, మటన్, ఫిష్ ఎంత ఇష్టంగా తింటారో వెజిటేబుల్ ప్రియులు పుట్టగొడుగులను అంతకంటే ఇష్టంగా తింటారు... వెజ్ ప్రియులే కాదు నాన్ వెజ్ ప్రియులకు కూడా పుట్టగొడుగులు అంటే ఎంతో ఇష్టం.. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే పుట్టగొడుగు గురించి వింటే అందరూ ఔరా అనాల్సిందే.
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం లోని తొండూరు మండలం గూడూరు గ్రామంలో ఓ రైతు పొలంలో అరుదైన పుట్టగొడుగు కనిపించింది . అది ఏకంగా ఒక కేజీ 300 గ్రాముల బరువు తూగింది. సాధారణంగా పుట్టగొడుగులు చిన్నగా మన చేతి వేళ్ళ పొడుగులో పుట్టుకొస్తూ ఉంటాయి. అయితే గంగాధర్ అనే రైతు పొలంలో పుట్టిన ఈ పుట్టగొడుగు జంబో పుట్టగొడుగు … దీనిని అల్లం పుట్టగొడుగు అని కూడా అంటారని రైతు అంటున్నాడు. ఈ పుట్టగొడుగు తూకం వేసి చూస్తే ఒక కేజీ 300 గ్రాముల బరువు తూగింది. సాధారణంగా ఇదే తూకంలో పుట్టగొడుగులు కొంటే ఒక పెద్ద క్యారీ బ్యాగ్ నిండా వస్తాయి. అలాంటిది ఒకటే పుట్టగొడుగు అంత బరువు తూగడం అనేది మామూలు విషయం కాదు. ఈ అరుదైన పుట్ట గొడుగు చూడడానికి స్థానికులు రైతు ఇంటికి క్యూ కట్టారు. దానిని చూసి.. ఎంత పెద్ద పుట్టగొడుగో.. అంటూ ఆశ్చర్యపోతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డబ్బులు లెక్కపెట్టుకుంటున్న వ్యక్తి.. ఇంతలో ఊహించని ట్విస్ట్
దేశాన్నే ఊపేస్తోన్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్
ఉదయాన్నే ఆలయానికి వెళ్లిన భక్తులు.. శివలింగంపై ఉన్నది చూసి షాక్

ఇదేం వింత సంప్రదాయం.. అక్కడ ప్రతీ పురుషుడికీ ఇద్దరు భార్యలు!

వందేళ్ల ప్రయాణం ముగిసింది.. వైరల్ వీడియో

ప్లాస్టిక్‌ను తినేస్తున్న పురుగులు..వైరల్ వీడియో

ఇది పొగ లేని సిగరెట్ కానీ దీనిని పీల్చరు.. తాగుతారు వీడియో

కుక్కను పెంచుకోవడానికి .. మీ ఇరుగు పొరుగు పర్మిషన్ తప్పనిసరి!

గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మి వెళ్తుండగా.. గుంతలో పడ్డ కారు

బద్ధలవుతున్న అగ్నిపర్వతం సాక్షిగా.. జంట నిశ్చితార్థం
