దేశాన్నే ఊపేస్తోన్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్
ఈ మధ్యన సస్పెన్స్, హారర్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీలో మంచి ఆదరణ దక్కుతోంది. థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా ఓటీటీలో మాత్రం ఈ సినిమాలు దుమ్మురేపుతుంటాయి. అలా ఇప్పుడు ఓ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కు కూడా ఓటీటీలో సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. సుమారు 2 గంటల 16 నిమిషాలు రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDb లో అవుటాఫ్ 10కి 7.5 రేటింగ్ ఉంది.
ఆ సినిమానే నవీన్ చంద్ర హీరోగా చేసిన ఎలెవన్. గత నెలలో థియేటర్లలో విడుదలైన ఎలెవన్ సినిమా.. అక్కడ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక రీసెంట్‌గా ఓటీటీలోకి రాగా ఇక్కడ కూడా ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ స్ట్రాంగ్ గా ఉండడంతో ఎలెవన్ సినిమా జనాలకు బాగా నచ్చేసింది. 2025 జూన్ 13 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా ఓటీటీల్లో ఈసినిమా అందుబాటులోకి వచ్చింది. అయితే తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో దేశంలోనే నెంబర్ వన్ మూవీగా ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ట్రెండ్ అవుతోంది. ఇదే విషయాన్ని చెబుతూ అమెజాన్ తమ సోషల్ మీడియా హ్యాండిల్లో ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది. ఇక లోకేశ్ అజిల్స్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ కథ విషయానికి వస్తే.. విశాఖపట్నంలో వరుస హత్యలు జరుగుతాయి. హత్యలన్నీ ఒకే రకమైన ప్యాటర్న్ లో జరుగుతుండడంతో ఇవి సీరియల్ కిల్లింగ్స్ అని దర్యాప్తులో తేలుతుంది. ఒక సిన్సియర్ అండ్ స్మార్ట్ పోలీస్ ఆఫీసర్ చేతికి ఈ సీరియల్ కిల్లింగ్ కేసును అప్పగిస్తారు. అయినా ఈ హత్యలు ఆగవు.అయితే ఒక హత్య కేసులో విక్టిమ్ బాడీ నుండి కీలకమైన లీడ్ దొరుకుతుంది. ఆ తర్వాత చనిపోయినవారంతా కవలలు అని, ఇద్దరిలో ఒకరిని మాత్రమే చంపుతున్నారని పోలీసాఫీసర్ తెలుసుకుంటాడు. మరి ఈ వరుస హత్యలు చేస్తున్న ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? కవలల్లో ఒకరిని మాత్రమే ఎందుకు చంపుతున్నాడు? సీరియల్ కిల్లర్‌కు ఈ ట్విన్స్ కు ఉన్న సంబంధం ఏంటి? పోలీసులు ఈ కేసును పరిష్కరించారా? సైకో కిల్లర్ ను పట్టుకున్నారా? లేదా? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉదయాన్నే ఆలయానికి వెళ్లిన భక్తులు.. శివలింగంపై ఉన్నది చూసి షాక్

ఇదేం వింత సంప్రదాయం.. అక్కడ ప్రతీ పురుషుడికీ ఇద్దరు భార్యలు!

వందేళ్ల ప్రయాణం ముగిసింది.. వైరల్ వీడియో

ప్లాస్టిక్ను తినేస్తున్న పురుగులు..వైరల్ వీడియో

ఇది పొగ లేని సిగరెట్ కానీ దీనిని పీల్చరు.. తాగుతారు వీడియో

కుక్కను పెంచుకోవడానికి .. మీ ఇరుగు పొరుగు పర్మిషన్ తప్పనిసరి!

గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మి వెళ్తుండగా.. గుంతలో పడ్డ కారు

బద్ధలవుతున్న అగ్నిపర్వతం సాక్షిగా.. జంట నిశ్చితార్థం
