Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయాన్నే ఆలయానికి వెళ్లిన భక్తులు.. శివలింగంపై ఉన్నది చూసి షాక్‌

ఉదయాన్నే ఆలయానికి వెళ్లిన భక్తులు.. శివలింగంపై ఉన్నది చూసి షాక్‌

Phani CH
|

Updated on: Jun 21, 2025 | 11:53 AM

Share

ఇటీవల పాములు ఎక్కడపడితే అక్కడ దర్శనమిస్తున్నాయి. ఇళ్లు, వాహనాలు, ఆలయ పరిసరాల్లోనూ పాములు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఆహారం కోసం వెతుకుతూ ఇలా జనావాసాల్లోకి చొరబడుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. అయితే ఒక్కోసారి విచిత్రంగా ఆలయాల్లో కనిపించే పాములు దైవదర్శనానికో, లేక తన స్వామి సేవకో వచ్చినట్టుగా విచిత్రంగా ప్రవర్తిస్తూ భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి.

శివలింగానికి చుట్టుకని గొడుగు పడుతున్నట్టుగా పడగవిప్పి కనిపించడం లాంటి ఘటనలు మనం చూశాం. తాజాగా పెద్దపల్లి జిల్లాలో మరోసారి ఇలాంటి ఘటనే జరిగింది. శివలింగాన్ని చుట్టుకొని నాగుపాము కనిపించింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రోజూలాగే పూజాదికాలు నిర్వహించేందుకు పూజారి వచ్చారు. అయితే ఆలయ ఆవరణలో ఉన్న శివలింగం వద్దకు రాగానే అక్కడ ఓ పెద్ద పాము కనిపించింది. దాంతో పూజారి భయంతో వెనక్కు వచ్చేశారు. విషయం తెలిసి భక్తులు కంగారు పడ్డారు. కాసేపు ఆలయంలో కలకలం రేగింది. అయితే పూజారి భక్తులకు ధైర్యం చెప్పి పక్కనే ఉన్న వేంకటేశ్వరస్వామివారికి పూజ చేసేందుకు వెళ్లారు. ఈలోపు పాము తనదారిన తానె వెళ్లిపోతుంది అనుకున్నారు. కానీ మళ్లీ వచ్చి చూసేసరికి పాము అక్కడే ఉండటంతో అది స్వామి సేవకోసం వచ్చిన నాగేంద్రుడేనని అందరూ భావించారు. సోమవారం రోజున ఇలా మహాశివునితోపాటుగా నాగేంద్రుడి దర్శనం కలగడం అంతా దైవ లీల అని భక్తులు శివలింగానికి, నాగుపాముకు నమస్కరించి వెళ్లిపోయారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నా భార్య ఎవరితో పోయినా పర్లేదు.. నన్ను చంపకుంటే చాలు