Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రతిరోజూ ఆలయానికి వెళ్తున్న నెమలి.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే! వీడియో

ప్రతిరోజూ ఆలయానికి వెళ్తున్న నెమలి.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే! వీడియో

Samatha J
|

Updated on: Jun 21, 2025 | 11:49 AM

Share

నెమలి మన జాతీయ పక్షి. అంతేకాదు హిందూ ధర్మం ప్రకారం నెమలి ఎంతో పవిత్రమైన పక్షి. నెమలిని సరస్వతిదేవి, సుబ్రహ్మణ్యస్వామివారికి వాహనంగా చెబుతారు. ఇదంతా ఇప్పుడెందుకు చెబుతున్నామంటే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ అద్భుత ఘటన చోటుచేసుకుంది. ఓ నెమలి ప్రతిరోజూ సమ్మక్క, సారలమ్మ ఆలయానికి వచ్చి అమ్మవార్ల దర్శనం చేసుకుంటుంది. క్రమం తప్పకుండా ఇలా ఆరేళ్లుగా నెమలి ఆలయానికి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. సాధారణంగా నెమలిని మనం జూలలో చూస్తాం. అక్కడ పురివిప్పిన నెమళ్లను చూసి ఆనందపడిపోతుంటాం. కానీ సహజసిద్ధంగా ప్రకృతి ఒడిలో నెమలి నాట్యం చేస్తే ఇంకెంత అందంగా ఉంటుందో కదా.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బండారుగూడెం గ్రామంలోని సమ్మక్క సారలమ్మ ఆలయం వద్దకు ప్రతిరోజూ ఓ నెమలి వస్తుంది. ప్రతిరోజూ ఉదయం ఎనిమిది గంటలకే ఆలయం వద్దకు చేరుకునే నెమలి సరిగ్గా సాయంత్రం నాలుగు గంటలకు తిరిగి అడవి బాట పడుతుంది..ఇలా గత ఆరేళ్ల కాలంగా ప్రతిరోజు సమ్మక్క సారక్క ఆలయాన్ని దర్శించుకుని ఆలయ ఆవరణలోనే రోజంతా గడుపుతోంది. దీంతో నిత్యం ఆలయానికి వచ్చే భక్తులు సాక్షాత్తు అమ్మవారే నెమలి రూపంలో ఇక్కడ ఉంటున్నారని భావిస్తున్నారు. అక్కడికి వచ్చేవారంతా నెమలితో సెల్ఫీలు దిగుతున్నారు. ఉదయాన్నే అమ్మవారికి నైవేద్యం సమర్పించే సమయానికి నెమలి వస్తుండటం సూర్యాస్తమయం సమయానికి తిరిగి అడవి బాట పడుతుండోత్తంతో ఆలయ పూజారికి, నెమలి మచ్చిక అయింది. దీంతో ఆలయంలో సమీపంలోనే ఉన్న పూజారి ఇంటి ముందర రోజంతా గడుపుతుంది. ఆలయ పూజారి ఆ నెమలిని మల్లు అని ప్రేమగా పిలుచుకుంటారు. ఆయన అమ్మవారితో పాటు నెమలికి కూడా నైవేద్యం పెడుతూ సపర్యలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఆలయానికి నెమలి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం :

మీ ఇంటిలోకి పాములు వస్తాయని భయపడుతున్నారా? ఈ మొక్కలు నాటి చూడండి!

ఇంటికి వచ్చిన భర్తకు ప్రేమగా మద్యం పోసిన భార్య తర్వాత ఊహించని ట్విస్ట్!

ఇప్పుడు నేను ఫుల్ హ్యాపీ ..ఆనందంలో సమంత వీడియో