8 Vasanthalu: అనంతిక సనీల్ కుమార్ అందమైన ప్రేమకథ.. 8 వసంతాలు సినిమా ఎలా ఉందంటే..
ప్రేమ కథలకి తిరుగులేని ఫ్యాన్ బేస్ ఉంది తెలుగు టూ స్టేట్స్‌లో..! మరోసారి వారిని టార్గెట్ చేస్తూ.. 8 వసంతాలు సినిమా థియేటర్స్‌లోకి వచ్చింది. గతంలో 'మధురం' అనే షార్ట్ ఫిల్మ్‌తో ఆకట్టుకున్న దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి.. ఈసినిమాను తెరకెక్కించారు. ట్రైలర్ కట్‌తో తన సినిమాపై అంచనాలను కూడా భారీగానే పెంచేశాడు. మరి ఈ సినిమా అంచనాలకు తగ్గట్టే ఉందా.? మరో తెలుగు ప్రేమక్షకులు తమ గుండెల్లో నిలుపుకునేలానే ఈ ప్రేమ కథ ఉందా? తెలుసుకోవాలంటే ఈ డిటేల్ రివ్యూను చూసేయండి.
8 వసంతాలు కథలోకి వెళితే.. శుద్ధి అయోధ్య అలియాస్ అనంతిక.. ఊటీలో తల్లితో కలిసి జీవిస్తుంటుంది. ఆర్మీలో పనిచేసే తండ్రి చనిపోవడంతో ఆ బాధ నుంచి తేరుకునేందుకు రచయితగా మారుతుంది. కరాటే నేర్చుకుంటూనే వీలు దొరికినప్పుడల్లా ట్రావెలింగ్ చేస్తుంటుంది. అలాంటి ఈమె జీవితంలోకి వరుణ్ అలియాస్ హను రెడ్డి వస్తాడు. శుద్ధిని ప్రేమలో పడేస్తాడు. కానీ ఓ సందర్భంలో తన స్వార్థం తాను చూసుకుని ఈమెకు బ్రేకప్ చెప్పేస్తాడు. ఆత్మ గౌరవంతో బతికే శుద్ధి ఏం చేసింది? ఈమె జీవితంలో వచ్చిన సంజయ్ అలియాస్ రవి దుగ్గిరాల ఎవరు? చివరకు శుద్ధి ప్రేమకథకు ఎలాంటి ముగింపు లభించింది అనేది మిగతా స్టోరీ.
Published on: Jun 21, 2025 06:11 PM
Follow Us
వైరల్ వీడియోలు
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు

