Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kubera: కుబేర సినిమాను చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్న ధనుష్.. ఆ సీన్ ఏంటో చూస్తే..

Kubera: కుబేర సినిమాను చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్న ధనుష్.. ఆ సీన్ ఏంటో చూస్తే..

Rajitha Chanti
|

Updated on: Jun 21, 2025 | 7:19 PM

Share

ధనుష్‌ , నాగ్ లీడ్‌ రోల్లో శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకక్కిన కుబేర ఫిల్మ్ తాజాగా రిలీజ్‌ అయింది. థియేటర్స్‌లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ క్రమంలోనే ఈ మూవీ చూసేందుకు చెన్నైలోని ఓ థియేటర్‌కు వెళ్లిన ధనుష్ ... సినిమా చూస్తూ ఒక్కసారిగా థియేటర్లోనే ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యాడు. కన్నీళ్లు పెట్టకున్నారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

కుబేర సినిమాకు పాజిటివ్‌ టాకే వస్తోంది. ఆ విషయం పక్కకు పెడితే.. ఈసినిమాకు సంబంధించిన ఓ విషయం ఇప్పుడు నాగ్ ఫ్యాన్స్‌ను షాకయ్యేలా చేస్తోంది. కుబేర సినిమాలో హీరోలు ఇద్దరైనప్పటికీ… ధనుష్‌కే నాగ్ కంటే ఎక్కువ స్కోప్ ఉన్న క్యారెక్టర్ దక్కింది. మెయిన్ లీడ్ ధనుష్‌ అనే విషయమూ పోస్టర్స్‌ చూస్తే కనిపిస్తోంది. సో ఆ లెక్కన చూస్తే.. తమిళ్లో ధనుష్‌ మార్కెట్ పరంగా ఈ సినిమాకు దిమ్మతిరిగే బిజినెస్ జరగాలి. కానీ అదే కుడి ఎమడమైందిప్పుడు. అక్కడ స్టార్ హీరోగా వెలుగొందుకున్న ధనుష్‌.. కుబేర బిజినెస్‌కు ఏమాత్రం హెల్ప్‌ కాలేదు. దీంతో అక్కడ జస్ట్ 20 కోట్ల ప్రీ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. అదే తెలుగులో మాత్రం ఈ మూవీ 33 కోట్ల బిజినెస్ చేసినట్టుగా టాక్. అంటే నాగ్ ను చూసి.. డైరెక్టర్ శేఖర్ కమ్ములను చూసి ఈ బిజినెస్ జరిగింది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని అయినా.. నాగ్ ను సినిమాలో కాస్త స్కోప్‌ ఇచ్చి ఉండాల్సింది కదాని ఫ్యాన్స్ కామెంట్.