డబ్బులు లెక్కపెట్టుకుంటున్న వ్యక్తి.. ఇంతలో ఊహించని ట్విస్ట్
తమిళనాడులోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన కొడైకెనాల్‌లో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. పర్యాటకుల నుంచి ఓ కోతి ఏకంగా రూ. 500 నోట్ల కట్టను లాక్కెళ్లి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ అనూహ్య పరిణామంతో అక్కడున్న టూరిస్టులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కొడైకెనాల్‌లోని గుణ గుహ సందర్శనకు వచ్చిన కర్ణాటకకు చెందిన కొందరు పర్యటకులు తమవద్ద ఉన్న డబ్బులు లెక్కచూసుకుంటున్నారు.
ఇంతలో ఎక్కడినుంచి వచ్చిందో ఓ కోతి అమాంతం వారి చేతిలోని రూ. 500 నోట్ల కట్టను లాక్కుని పారిపోయింది. దూరంగా చెట్టుపైన కూర్చుని ఆ నోట్లను ఒక్కొక్కటి తీసి గాల్లోకి విసిరేసింది. ఈ దృశ్యాలను అక్కడ ఉన్నవారు తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీసి, సోషల్ మీడియాలో పెట్టారు. దాంతో వీడియో వైరల్‌గా మారింది. ఇలాంటి ఘటనలు మన దేశంలో కొత్తేమీ కాదు. గతంలో మధ్యప్రదేశ్‌లో కూడా ఇదే తరహాలో ఓ సంఘటన జరిగింది. అక్కడ ఓ ఆటో ప్రయాణికుడి నుంచి ఏకంగా లక్ష రూపాయల నగదును ఓ కోతి లాక్కెళ్లింది. ఆ తర్వాత ఓ చెట్టెక్కి నోట్లను కిందకు విసిరేయడంతో వాటిని ఏరుకోవడానికి జనం ఎగబడ్డారు. సాధారణంగా జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు కోతులు ఎక్కువగా ఆకర్షితులవుతుంటాయి. పర్యటకులు, స్థానికులు వాటికి ఆహారం అందించడం వల్ల అవి మనుషులకు బాగా అలవాటుపడి, వారి నుంచి వస్తువులు లాక్కోవడానికి కూడా వెనుకాడటం లేదని వన్యప్రాణి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కోతులకు ఆహారం పెట్టడం, వాటిని మనుషులకు మరీ దగ్గరగా రానివ్వడం వంటి చర్యల వల్లే ఇలాంటి సమస్యాత్మక ప్రవర్తన వాటిలో పెరుగుతోందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పర్యాటక ప్రాంతాలకు వెళ్లేవారు తమ వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దేశాన్నే ఊపేస్తోన్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్
ఉదయాన్నే ఆలయానికి వెళ్లిన భక్తులు.. శివలింగంపై ఉన్నది చూసి షాక్

రైలులో యువతి రీల్.. కానీ ఊహించని గెస్ట్ ఎంట్రీతో సీన్ రివర్స్

చేపకు గాలం వేస్తే.. జాలరే గల్లంతయ్యాడు వీడియో

సజీవ పురుగుల్ని వాంతి చేసుకుంటున్న చైనా బాలిక వీడియో

సునామీ మేఘాన్ని చూసారా వీడియో

గాజు సీసాల్లో మైక్రోప్లాస్టిక్స్.. ? వీడియో

రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా..

రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా?

నమీబియా పార్లమెంట్లో ప్రధాని మోదీ కీలక ప్రసంగం..

రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా..

రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా?
