Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దూసుకొస్తున్న డేంజరస్‌ డేట్‌.. భయంతో వణికిపోతున్న జపాన్‌!

దూసుకొస్తున్న డేంజరస్‌ డేట్‌.. భయంతో వణికిపోతున్న జపాన్‌!

Phani CH
|

Updated on: Jun 21, 2025 | 12:40 PM

Share

మాంగా కామిక్‌లో చేసిన ఒక వింతైన అంచనా జపాన్‌ ప్రజల్లో ఆందోళనను పెంచుతోంది. న్యూ బాబా వంగాగా పిలువబడే మాంగా ఓ కామిక్‌ బుక్‌లోని పాత్ర రియో టాట్సుకి చెప్పినట్లు జూలై 5న జపాన్‌లో భారీ విపత్తు సంభవిస్తుందని అంతా భయపడుతున్నారు. ఆ తేదీకి కొన్ని వారాలు మాత్రమే మిగిలి ఉండటంతో చాలా మంది ప్రయాణికులు జపాన్‌కు వెళ్లకుండా తమ ప్రణాళికలను రద్దు చేసుకుంటున్నారు.

సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. అత్యధికంగా అమ్ముడైన కామిక్ ది ఫ్యూచర్ ఐ సా 2021 ఎడిషన్‌లో జపనీస్ మాంగా కళాకారిణి రియో టాట్సుకి జూలై 5, 2025న జపాన్‌లో విపత్తు సంభవిస్తుందని అంచనా వేసింది. అయితే అది ఎలాంటి విపత్తు అనే దాని గురించి స్పష్టంగా ప్రస్తావించనప్పటికీ ప్రజల్లో భయందోళనలు వ్యక్తం అవుతున్నాయి. జూలై 5వ తేదీ దగ్గరపడుతున్న క్రమంలో ఇతర దేశాల నుంచి జపాన్‌కు వెళ్లేందుకు చాలా మంది ఆసక్తి చూపించడం లేదు. అది టికెట్‌ బుకింగ్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. బ్లూమ్‌బెర్గ్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం.. జూలై ప్రారంభంలో హాంకాంగ్ నుండి విమానాలు హోటళ్ళు బుకింగ్స్‌ దాదాపు 50 శాతం తగ్గాయి. చైనా, థాయిలాండ్, వియత్నాం నుండి బుకింగ్‌లు 83 శాతం వరకు తగ్గాయి. ఇది జపాన్ పర్యాటక పరిశ్రమకు తీవ్రమైన దెబ్బగా చెప్పుకోవచ్చు. ఈ గందరగోళం మధ్య జపాన్ అధికారులు ప్రజలు ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మియాగి గవర్నర్ యోషిహిరో మురై విలేకరుల సమావేశంలో ఈ ఆందోళనల గురించి ప్రస్తావించారు. “జపనీయులు విదేశాలకు పారిపోవడం లేదు కాబట్టి ఆందోళన చెందదాల్సిన అవసరం లేదు. ప్రజలు పుకార్లను విస్మరించి జపాన్‌ను సందర్శించాలని ఆశిస్తున్నాను” అని మీడియాకు తెలిపారు. అధికారులు అవన్నీ పుకార్లు వాటిని నమ్మొద్దని చెబుతున్నా సోషల్ మీడియాలో మాత్రం జూలై 5 గురించి ఆందోళనలు గట్టిగా వినిపిస్తున్నాయి. #July5Disaster వంటి హ్యాష్‌ట్యాగ్‌లు వైరల్ అవుతున్నాయి. భూకంపాలు, సునామీలు లేదా సైబర్ దాడుల గురించి ఊహాజనిత పోస్ట్‌లతో జపాన్‌ సోషల్‌ మీడియా నిండిపోయింది. గతంలో ఈ రియో టాట్సుకి అనే కార్టూన్‌ పాత్ర చెప్పినట్లు మార్చి 2011లో తోహోకు భూకంపం, సునామీ, యువరాణి డయానా మరణం, ఫ్రెడ్డీ మెర్క్యురీ మరణం, COVID-19 మహమ్మారి వంటివి నిజంగానే సంభవించాయి. అందుకే ఇప్పుడు జూలై 5 గురించి కూడా చాలా మంది భయపడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అదనపు కట్నంగా .. కోడలిని ఏం అడిగారో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్

జంబో పుట్టగొడుగును ఎప్పుడైనా చూశారా ??

డబ్బులు లెక్కపెట్టుకుంటున్న వ్యక్తి.. ఇంతలో ఊహించని ట్విస్ట్‌

దేశాన్నే ఊపేస్తోన్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్

ఉదయాన్నే ఆలయానికి వెళ్లిన భక్తులు.. శివలింగంపై ఉన్నది చూసి షాక్‌