Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మీ దేశానికి పో !’ యువతితో రాపిడో రైడర్.. దాడి కేసులో ట్విస్ట్

‘మీ దేశానికి పో !’ యువతితో రాపిడో రైడర్.. దాడి కేసులో ట్విస్ట్

Phani CH
|

Updated on: Jun 21, 2025 | 12:58 PM

Share

బెంగుళూరు నగరంలో రీసెంట్‌గా షాకింగ్ ఘటన జరిగింది. రాపిడో బైక్‌ను బుక్ చేసుకున్న యువతి ర్యాష్ డ్రైవింగ్ కారణంగా బైక్ రైడర్‌తో గొడవ పడింది. బైక్ దిగిన తర్వాత డబ్బులు చెల్లించేందుకు కూడా ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన రాపిడో రైడర్ ఆ యువతి పై దాడికి దిగాడు. ఈ గొడవ సమయంలో ఆమె ఇంగ్లీష్, రాపిడో రైడర్ కన్నడలో పోట్లాడుకున్నారు.

ఈ ఘటనపై పోలీసులు రాపిడో రైడర్ పై కేసు నమోదు చేసి.. అతనిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, పోలీసుల విచారణలో అతను సంచలన వ్యాఖ్యలు చేశారు. బైక్ రైడింగ్ సమయంలో.. తన బైక్ రోడ్డు మధ్యలో ఉన్నప్పుడు ఆమె బైక్ ఆపమని తనను కోరిందని, అలా ఆపితే.. వెనకనుంచి వచ్చే వాహనాలు ఢీకొట్టే ప్రమాదం ఉందని తాను చెప్పానని, దీంతో ఆమె గొడవకు దిగిందని విచారణ సమయంలో బైక్ టాక్సీ డ్రైవర్ సుహాస్ వెల్లడించారు. దీంతో తానూ కోపం పట్టలేక.. ఆవేశంలో ‘మీ దేశం పో’ అని అరిచానని అతను ఒప్పుకున్నాడు. గొడవ సమయంలో ఆమె.. తనను చదువురాని వాడినని ఎగతాళి చేయటమే గాక.. నోటికొచ్చినట్లు మాట్లాడిందని, అంతటితో ఆగకుండా కాలర్ పట్టుకుని గొడవకు దిగిందని అతను తెలిపాడు. ఆ తర్వాత ఆమె నాకు ఇవ్వాల్సిన డబ్బు గురించి అడిగితే.. రెండుసార్లు టిఫిన్ బాక్స్‌తో కొట్టిందని, ఇక కోపం ఆపుకోలేక తాను కూడా తిరిగి చెంపమీద కొట్టాననీ చెప్పుకొచ్చాడు. అప్పటికే నలుగురూ పోగై చూస్తున్నారని, ఇకనైనా గొడవ ఆపాలని ప్రాధేయపడినా.. ఆమె రెచ్చిపోయి దూషిస్తూనే ఉందని అన్నాడు. తనను ఇంత ఇబ్బంది పెట్టిన ఆ యువతి పైనా కేసు నమోదు చేయాలని అతను డిమాండ్ చేసాడు. కాగా, దీనిపై ఆ యువతి మీడియాతో మాట్లాడుతూ.. ఆ రైడర్ ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఇష్టం వచ్చినట్లు బండి నడిపాడని, వద్దన్నందుకే వాదనకు దిగాడని చెప్పుకొచ్చింది. అతడికి డబ్బులు చెల్లించి హెల్మెట్ కూడా ఇచ్చాననీ పేర్కొంది. లాంగ్వేజ్ ప్రాబ్లమ్ తో అతనితో మాట్లాడడానికి ఇబ్బంది పడ్డాననీ కానీ, అతగాడు మాత్రం తనను ‘మీ దేశానికి తిరిగి వెళ్ళు’ అని అన్నాడనీ తెలిపింది. ‘కన్నడ మాట్లాడలేకపోతే.. మా రాష్ట్రంలో ఉండొద్దు’ అని అతడు అని ఉంటే కూడా తాను బాధ పడేదాన్ని కాదని, కానీ అతడు నన్ను దేశమే విడిచిపోవాలంటూ మండిపడ్డాడని వాపోయింది. అతడు “రాష్ట్రం” అనే మాటకు బదులు “దేశం” అనటం తప్పని, దానికి అతడిపై చర్య తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బిచ్చగాడినంటూ ఇంటికి వచ్చాడు.. ఆమె ఒంటరిగా కనిపించేసరికి..

దూసుకొస్తున్న డేంజరస్‌ డేట్‌.. భయంతో వణికిపోతున్న జపాన్‌!

అదనపు కట్నంగా .. కోడలిని ఏం అడిగారో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్

జంబో పుట్టగొడుగును ఎప్పుడైనా చూశారా ??

డబ్బులు లెక్కపెట్టుకుంటున్న వ్యక్తి.. ఇంతలో ఊహించని ట్విస్ట్‌