Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరటి పువ్వా.. అని తీసిపారేయకండి.. వారికి ఇది దివ్యౌషధం

అరటి పువ్వా.. అని తీసిపారేయకండి.. వారికి ఇది దివ్యౌషధం

Phani CH
|

Updated on: Jun 22, 2025 | 1:30 PM

Share

మన ఆరోగ్యానికి అరటి పండు ఎంత బాగా ఉపయోగపడుతుందో అంతే ఆరోగ్యప్రయోజనాలు అరిటి పువ్వులోనూ ఉన్నాయంటున్నారు నిపుణులు. అరటి పువ్వులో ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి. అరటి పువ్వులో శరీరానికి అవసరమైన ఫైబర్, ప్రోటీన్లు, పొటాషియం, విటమిన్స్ ఎ,సి,ఇ,కె పుష్కలంగా ఉన్నాయి. అరటి పువ్వులో ఉండే అధిక పొటాషియం వల్ల రక్తపోటును నియంత్రించుకోవచ్చు.

రక్తహీనత నివారణకు అరటి పువ్వ ఎంతో దోహదం చేస్తుంది. ఈ పువ్వు మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్య ఔషధమని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఇది తింటే జీవితంలో మధుమేహం రాదని అంటున్నారు. డయాబెటిస్ అనేది ఒక సాధారణ ఆరోగ్య సమస్య. ఈ వ్యాధిని మధుమేహం లేదా షుగర్ వ్యాధి అని కూడా అంటారు. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇది సాధారణంగా ప్యాంక్రియాస్ సరిగ్గా ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోవడం వల్ల లేదా శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించలేకపోవడం వల్ల వస్తుంది. ప్రస్తుత కాలంలో చిన్న పిల్లలు మొదలుకుని పెద్దలవరకు చాలా మంది ఈ చక్కెర వ్యాధితో బాధపడుతున్నారు. దీని కోసం కొంతమంది మందులు వాడతారు. మరికొందరు ఇన్సులిన్ తీసుకుంటారు. కానీ, అరటి పువ్వు డయాబెటిస్‌కు ఒక అద్భుతంలా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అరటి పువ్వులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరంగా ఉంచుతాయని, దీనిలోని ఫైబర్ ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుందని అంటున్నారు. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యంగా ఉంటాయని చెబుతున్నారు. అరటి పువ్వులో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని నివారిస్తాయి. దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధులు కూడా తగ్గుతాయి. అరటి పువ్వులో మెగ్నీషియం చాలా సమృద్ధిగా ఉంటుంది. మెగ్నీషియం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ బి6 కూడా ఉంటుంది. ఇవి మహిళల్లో రుతుక్రమ సమస్యలను నివారించి ఆరోగ్యాన్ని కాపాడతాయి. అంతేకాకుండా, ఇందులో ఉండే విటమిన్లు ఎ, సి, పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కాలానుగుణ వ్యాధులను నివారిస్తాయి. ఇది శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పచ్చి బాదం పప్పు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే వదలరు

కదలకుండా ఉన్న మొసలిని చూసి చనిపోయిందనుకున్నారు.. ఆ తర్వాత

చెట్ల పొదల్లో కళ్లు చెదిరే సీన్‌.. ఆశ్చర్యంతో చూస్తుండిపోయిన స్థానికులు